300 ఎంబిపిఎస్ ప్లాన్‌ను లాంచ్ చేసిన హాత్‌వే

Hathway launching 300 Mbps Broadband Plan

హైదరాబాద్: బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ హాత్‌వే 300 ఎంబిపిఎస్ నెట్ స్పీడ్‌తో ఓ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను సోమవారం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ చెన్నై కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లకు 2టిబి వరకు ఫ్రీ డేటా లభిస్తోంది. డేటా లిమిట్ అయిపోగానే స్పీడ్ 5 ఎంబిపిఎస్‌కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్ నెలవారీ రెంటల్‌ను రూ.1699 గా నిర్ణయించింది హాత్‌వే. కస్టమర్లు ఒకేసారి 12 నెలలకు ఈ ప్లాన్‌ను కనుక తీసుకుంటే వారికి ఈ ప్లాన్ నెలకు రూ.1250 మాత్రమే చార్జ్ అవుతుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఈ ప్లాన్ ఇండియాలో ఉన్న ఇతర హాత్‌వే బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తోంది అనే విషాయాన్ని వెల్లడించలేదు.