2 వేల వార్డులు కాదు…అక్కడ 20 వార్డుల్లో ఒక్క వార్డు బిజెపి గెలువదు: హరీష్

Harish Rao

సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోయిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బహిరంగ సభలో సోమవారం ఉదయం హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్‌ది ఫస్ట్ ప్లేస్ కాదని, లాస్ట్ ప్లేస్ అని, రెండు వేల వార్డుల్లో గెలుస్తామని బిజెపి చెబుతోందని, గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఒక్క వార్డులో కూడా గెలిచే సత్తా బిజెపికి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల ఓటు వృథాగా పోదని, గతంలో ఓట్లు వేసుకొని గజ్వేల్‌ని చక్కగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. గజ్వేల్‌లో 20కి 20 స్థానాల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధికి రుణం తీర్చుకోవాలని ఓటర్లకు సూచించారు. భవిష్యత్‌లో సిఎం కెసిఆర్ నేతృత్వంలో గజ్వేల్ ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా మారుతుందని పేర్కొన్నారు.  ఈ సభకు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి హాజరయ్యారు.

 

Harish Rao Comments on BJP, Congress in Gajwel

The post 2 వేల వార్డులు కాదు… అక్కడ 20 వార్డుల్లో ఒక్క వార్డు బిజెపి గెలువదు: హరీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.