ఇంటింటికీ రెండు పాడిపశువులు : హరీశ్

  మెదక్: తూప్రాన్ మండలం మల్కాపూర్ లో 200వ వారం శ్రమదాన కార్యక్రమం సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ఎర్రబల్లి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మట్లాడుతూ… మల్కాపూర్ వైపు తెలంగాణ రాష్ట్రం చూస్తుందని, స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావులు పేర్కోన్నారు. అనంతరం గ్రామానికి 85లక్షల సిసి రోడ్లు, 86 లక్షల మురికి కాలువలు, 7లక్షల 50 రాక్ గార్డెన్ […] The post ఇంటింటికీ రెండు పాడిపశువులు : హరీశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెదక్: తూప్రాన్ మండలం మల్కాపూర్ లో 200వ వారం శ్రమదాన కార్యక్రమం సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ఎర్రబల్లి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మట్లాడుతూ… మల్కాపూర్ వైపు తెలంగాణ రాష్ట్రం చూస్తుందని, స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావులు పేర్కోన్నారు. అనంతరం గ్రామానికి 85లక్షల సిసి రోడ్లు, 86 లక్షల మురికి కాలువలు, 7లక్షల 50 రాక్ గార్డెన్ ప్రహరిగోడ, కమ్యూనిటి హాల్, పాఠశాల రూపకల్పనకు 65 లక్షల 50 వేలు అభివృద్ధి పనులకు మంత్రులు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు.

ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేస్తే గ్రామాలు ముందుకెళ్తాయాని వివరించారు. మాల్కాపూర్ లో 200 డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాలు, ఇంటికి రెండు పాడిపశువులను త్వరలోనే అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. మల్కాపూర్ గ్రామ ప్రజల స్పూర్తిని తెలంగాణ ప్రజలు తీసుకోవాలని వివరించారు. మూడెళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అభివృద్ధిలో మల్కాపూర్ గ్రామం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, గంగదేవి పల్లిని మించి మాల్కాపూర్ అభివృద్ధి చెందింది. మాల్కాపూర్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసిన గ్రామ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సిఎం కెసిఆర్ కలలను నిజం చేసిన ఘనత మాల్కాపూర్ గ్రామానిదని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు.

Harish Rao and Errabelli visit Malkapur Village at Toopran

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంటింటికీ రెండు పాడిపశువులు : హరీశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: