అవధుల్లేని.. స్నేహబంధం

Happy-Friendship-Dayఅమ్మా నాన్నలు, బంధవుల్ని దేవుడే సృష్టించి, స్నేహితులను మాత్రం ఎంపికచేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే మంచి అనుబంధం. స్నేహంలో వారి మధ్య ఏ విధమైన కల్మషం, అపార్ధం లేకుండా ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయతలు కలిగి ఉంటారు. సాధారణంగా ఒకే విధమైన భావాలు, మనోభవాలు, అభిరుచులు ఉన్న వారి మధ్య స్నేహం పుడుతుంది. స్నేహానికి వయసు, లింగం, స్థానం, కులం, మతం అనే ఏ విధమైన భేదాలు ఉండవు.

మంచి స్నేహాతుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాంతం సంతోషంగా ఉంచుతారు. మనలా ఆలోచించి, గురువులా బోధించి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. కష్టంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్యౌషధం స్నేహం.

ఎలా మొదలైంది?

1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఫ్రెండ్‌షిప్‌డేను జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. ఈ రోజు స్నేహితులు ఎక్కడున్నా సరే, వారిని కలవడమో శుభాకాంక్షలు పంపడమో చేస్తుంటారు.

Happy Friendship Day 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అవధుల్లేని.. స్నేహబంధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.