సుఖేందర్‌కు మండలి మకుటం

  ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శాసనసభ కార్యదర్శి ప్రకటన, డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌రావు తోడురాగా సీట్లో కూర్చున్న సుఖేందర్ రెడ్డి నిరంతర తెలంగాణవాది, అజాత శత్రువు : కెటిఆర్ హైదరాబాద్ : శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తాసుఖేందర్ రెడ్డి విపక్షాల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం శాసనమండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి గుత్తసుకేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యలు ప్రకటించడంతో డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్ రావు సుఖేందర్ రెడ్డిని ఛైర్మన్ సీటు పై కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం […] The post సుఖేందర్‌కు మండలి మకుటం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శాసనసభ కార్యదర్శి ప్రకటన, డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌రావు తోడురాగా సీట్లో కూర్చున్న సుఖేందర్ రెడ్డి
నిరంతర తెలంగాణవాది, అజాత శత్రువు : కెటిఆర్

హైదరాబాద్ : శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తాసుఖేందర్ రెడ్డి విపక్షాల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం శాసనమండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి గుత్తసుకేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యలు ప్రకటించడంతో డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్ రావు సుఖేందర్ రెడ్డిని ఛైర్మన్ సీటు పై కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం తపించిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయాల్లో అజాత శత్రవుని ప్రశంసించారు. గ్రామస్థాయిలోని వార్డుమెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడుగా, శాసనమండలి ఛైర్మన్‌గా ఎలాంటి వివాదాలకు అవకాశాలు ఇవ్వకుండా ఎదిగిన నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ ఆయన గుర్తు చేశారు.

జిల్లా పరిషత్ ప్రదేశిక సభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా పలు హోదాల్లో ఆయన పనిచేసి తెలంగాణ ప్రాంతాభివృద్ధికోసం తపించిన నాయకుడని గుత్తాను కెటిఆర్ కొనియాడారు. డైరీ రంగంలో, సహకారరంగంలో విశేష సేవలందించారన్నారు. గుత్తాసుఖేందర్ రెడ్డి గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడూ చెపుతుంటారని కెటిఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలో కెసిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు గుత్తాతో కలిసి నిర్మల్ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఇద్దరూ కలిసి ఎస్‌ఆర్‌ఎస్‌పి సందర్శించి ఆంధ్రపాలనలో ఎస్‌ఆర్‌ఎస్‌పి శివాలయంగాను నాగార్జునసాగర్ వైష్ణవాలయంగాను ఉన్నాయని విచారం వ్యక్తం చేశారని కెటిఆర్ చెప్పారు. 1999లో కెసిఆర్,గుత్తా ఆశించినట్లు గానే ఎస్‌ఆర్‌ఎస్‌పికి కాళేశ్వరం నీళ్లు వచ్చిన రోజే గుత్తా ఛైర్మన్ బాధ్యతలు చేపట్టడం యాదృశ్చికం అన్నారు. శాసన మండలి హుందాగా జరిగేవిధంగా గుత్తా సహకరిస్తారని ఆయన అకాంక్షించారు.

శాసనసభలో స్పీకర్ పోచారం, శాసన మండలిలో గుత్తా ఇద్దరూ రైతు బిడ్డలే కావడం, వ్యవసాయరంగంపై పూర్తి అవగాహన ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాల్లో ఆదర్శనీయమన్నారు. గ్రామస్థాయి నాయకుడి నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవుల్లో ఒకటైన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ పార్లమెంట్ సభ్యుడు హోదాలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన నాయకుడు గుత్తా సుఓఖేందర్ రెడ్డి అంటూ ప్రశంసించారు. రాష్ట్ర మహిళాశిశుసంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన మంత్రిగా తొలిసారిగా గుత్తాసుఖేందర్ రెడ్డి గురించి మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ గుత్తాసుఖేందర్ రెడ్డికి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. గుత్తాసుఖేందర్ రెడ్డి ఛైర్మన్‌హోదాలో శాసనమండలికి మరింత వన్నెతెస్తారని ఆమె ఆశించారు. గతంలో నల్గొండ ఎన్నికల్లో గుత్తాసుఖేందర్ రెడ్డితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. నల్గొండ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ఆయన శాసనమండలిని దేశంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తాసుకేందర్ రెడ్డి సభ గౌరవాన్ని మరింత పెంచుతారన్నారు. నాలుగు దశాబ్దాల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తాసుఖేందర్ రెడ్డి హయాంలో ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు.

2001లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు సుఖేందర్ రెడ్డి నల్గొండ ఎంపిగా ఉన్నారు. అప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ఢిల్లీకి వెళ్లి పోరాడి నిధులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని విభేధించి తాను టిఆర్‌ఎస్‌లో చేరగా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆతర్వాత ఇద్దరం ఇప్పుడు టిఆర్‌ఎస్ లో కలుసుకునే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గుత్తాసుకేందర్ రెడ్డి దగ్గరనుంచి నేర్చుకోవల్సిన అంశాలు అనేకం ఉన్నాయన్నారు. సమస్యవచ్చినప్పుడు ఓపికగా మూలలనుంచి పరిశీలించి పరిష్కరించే తత్వం ఆయనకుందని ప్రశంసించారు. అలాగే రాష్ట్రం మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు 22 మంది మండలి సభ్యులు గుత్తాసుకేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు.

శాసనమండలిలో పండుగ వాతావరణం
శాసనమండలిలో గుత్తసుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారనే ప్రకట వెలుబడగానే కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, బిజెపి సభ్యుడు రామచందర్ రావు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మంత్రులు, శాసనమండలి సభ్యులు గుత్తసుఖేందర్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శానమండలి వెలుపల వందలాధి మంది అభిమానులు సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలిచ్చారు.

Guttasukhender Reddy is Chairman of Legislative Council

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సుఖేందర్‌కు మండలి మకుటం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: