యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గుత్తా

Guttaయాదాద్రి భువనగిరి : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం ఉదయం  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుత్తా మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు కెసిఆర్ దార్శనికుడని ఆయన చెప్పారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఉందని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని తాను స్వామివారిని కోరుకున్నట్టు గుత్తా వెల్లడించారు. మండలి చైర్మన్ పదవికి వన్నె తెస్తానని ఆయన చెప్పారు.

Gutta Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గుత్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.