టిఆర్ఎస్ కు తిరుగులేని మెజార్టీ : గుత్తా

చిట్యాల (నల్లగొండ) : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అభ్యర్దులకు తిరుగులేని మెజారీటీని ప్రజలు అందిస్తారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పార్లమెంట్ ఎన్నికలపై మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో కలిసి టిఆర్‌ఎస్ పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకలు కేంద్రంలో వినపడాలంటే టిఆర్‌ఎస్ ఎంపిలు గెలవాల్సిన అవసరం ఉందని […]

చిట్యాల (నల్లగొండ) : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అభ్యర్దులకు తిరుగులేని మెజారీటీని ప్రజలు అందిస్తారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పార్లమెంట్ ఎన్నికలపై మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో కలిసి టిఆర్‌ఎస్ పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకలు కేంద్రంలో వినపడాలంటే టిఆర్‌ఎస్ ఎంపిలు గెలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, రైతుబంధు, రైతు భీమా లాంటి పధకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అమలయ్యే పథకాల పేర్లు మార్చి ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు.. గత ఎంపిలు కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చేందుకు ఎంతో కృషి చేశారని గుత్తా వెల్లడించారు. భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్‌ను, నల్లగొండ పార్లమెంట్ స్దానం నుంచి వేమిరెడ్డి నర్సింహారెడ్డి ని అత్యధిక మెజారీటీతో ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను తీసుకురావటానికి బూర నర్సయ్యగౌడ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. సిఎం కేసిఆర్ తనను శాసనమండలికి పంపిస్తానని హామీ ఇవ్వటం వల్లనే తాను పార్లమెంట్ బరిలో లేనని అన్నారు. పిసిసి ప్రసిడెంట్‌గా, మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏనాడు ప్రజలతో మమేకం కాలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పోటీలో వున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పోలికే లేదని ఆయన అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్‌ఎస్ అభ్యర్థులపై చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. రాజకీయ పరిజ్ణానం లేని కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. సిఎం కేసిఆర్ ఏ అవకాశం ఇచ్చినా శిరోధార్యంగా భావించి పనిచేస్తానని గుత్తా అన్నారు. ఈ సమావేశంలో చిట్యాల జడ్‌పిటిసి శేపూరి రవీందర్, మండల టిఆర్‌ఎస్ అద్యక్షుడు కాటం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పల్లపు బుద్డుడు,బెల్లి సత్తయ్య , బట్టు అయిలేష్, పాటి మాధవరెడ్డి, గుండెబోయిన సైదులు, నర్రా మోహన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Gutta Sukhender Reddy Comments on Loksabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: