ఉత్తమ్‌కు ఓటమి ఖాయం : గుత్తా

నల్లగొండ: నల్లగొండ లోక్ సభ స్థానంలో టిపిసిసి చీఫ్  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని టిఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ ఎంపిగా టిఆర్ఎస్ అభ్యర్థి  వేమిరెడ్డి నరసింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఎంఎల్ఎలను  కాపాడుకోలేని ఉత్తమ్‌ ఎంపిగా గెలుస్తానని గొప్పలకు చెప్పుకుంటున్నాడని గుత్తా ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా వేమిరెడ్డి నరసింహారెడ్డి ఈ నెల 25న నామినేషన్‌ దాఖలు చేస్తారని […]

నల్లగొండ: నల్లగొండ లోక్ సభ స్థానంలో టిపిసిసి చీఫ్  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని టిఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ ఎంపిగా టిఆర్ఎస్ అభ్యర్థి  వేమిరెడ్డి నరసింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఎంఎల్ఎలను  కాపాడుకోలేని ఉత్తమ్‌ ఎంపిగా గెలుస్తానని గొప్పలకు చెప్పుకుంటున్నాడని గుత్తా ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా వేమిరెడ్డి నరసింహారెడ్డి ఈ నెల 25న నామినేషన్‌ దాఖలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన  తీర్పే మళ్లీ పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనను ఎంఎల్ సి అభ్యర్థిగా ప్రకటించిన సిఎం కెసిఆర్ కు గుత్తా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ అసమర్ధ నాయకత్వంలో ఉందని, తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఈ క్రమంలోనే చాలా మంది కాంగ్రెస్ అగ్రనేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని గుత్తా పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలను సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Gutta Comments on TPCC Chief Uttam

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: