ఢిల్లీని శాసించాలి : గుత్తా

మిర్యాలగూడ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలు సాధించి తీరుతుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 16 స్థానాల్లో టిఆర్ఎస్ గెలుపు తథ్యమని, అయితే మెజార్టీపై దృష్టి సారించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మిర్యాలగూడలో జరిగి బహిరంగ సభకు సిఎం కెసిఆర్ వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. గురువారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు […]

మిర్యాలగూడ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలు సాధించి తీరుతుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 16 స్థానాల్లో టిఆర్ఎస్ గెలుపు తథ్యమని, అయితే మెజార్టీపై దృష్టి సారించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మిర్యాలగూడలో జరిగి బహిరంగ సభకు సిఎం కెసిఆర్ వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. గురువారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ రవీందర్‌రావు, ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో కలిసి మాట్లాడారు. తెలంగాణలో ఉన్న 17 ఎంపి సీట్లల్లో టిఆర్‌ఎస్ 16 స్ధానాలను తప్పక గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. కేంద్రంలో టిఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రముఖ పాత్ర పోషిస్తారన్నారు. కేంద్రంలో మన బలం ఎక్కువగా ఉంటే మనకు న్యాయంగా రావాల్సిన నిధులు, నీటిపారుదల వాటాలు, విభజన ఆంశాలు సాధించుకోవచ్చునన్నారు. నల్లగొండ, భువనగిరి రెండు ఎంపి సీట్లను ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సభకు మిర్యాలగూడ నియోజక వర్గం నుంచి 852 ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు 1370, లారీలు, డిసిఎంలు 138తో పాటు దాదాపుగా 65 వేల మంది ఈ సభకు హజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Gutta Comments on Loksabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: