‘గుంజన్ సక్సేనా’ట్రైలర్ విడుదల..

GUNJANA SAXENA movie trailer released

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా:ది కార్గిల్ గర్ల్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ధీర వనిత, ఎయిర్ ఫోర్స్‌ తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ టైటిల్ పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కారోనా కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో పలు చిత్రాలు ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రం కూడా అదే బాటలో విడుదల కానుంది. అగస్టు 12న ‘గుంజన్ సక్సేనా’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ లో విడుదల చేయనున్నారు.

GUNJAN SAXENA movie trailer released

The post ‘గుంజన్ సక్సేనా’ ట్రైలర్ విడుదల.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.