వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ : వరంగల్‌ నగర మేయర్‌గా గుండా ప్రకాశ్‌ రావును నియమించారు. ప్రకాశ్ రావు పేరును టిఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. మేయర్ గా ప్రకాశ్‌ పేరును టిఆర్ఎస్ పరిశీలకులు గ్యాదరి బాలమల్లు ప్రకటించారు.  వరంగల్ నగర  మేయర్ ఎన్నికకు బల్దియా ప్రధాన కార్యాలయలో శనివారం  కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  ఎన్నిక ప్రిసైడింగ్‌ అధికారి అయిన జిల్లా  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రకాశ్ రావును మేయర్ గా […] The post వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్‌ : వరంగల్‌ నగర మేయర్‌గా గుండా ప్రకాశ్‌ రావును నియమించారు. ప్రకాశ్ రావు పేరును టిఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. మేయర్ గా ప్రకాశ్‌ పేరును టిఆర్ఎస్ పరిశీలకులు గ్యాదరి బాలమల్లు ప్రకటించారు.  వరంగల్ నగర  మేయర్ ఎన్నికకు బల్దియా ప్రధాన కార్యాలయలో శనివారం  కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  ఎన్నిక ప్రిసైడింగ్‌ అధికారి అయిన జిల్లా  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రకాశ్ రావును మేయర్ గా ఎన్నుకున్నారు. ఉప ఎన్నికలో ఎన్నికైన 19వ  డివిజన్ కార్పొరేటర్ నాగరాజుతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ అభ్యర్థిగా గుండా ప్రకాశ్‌ రావు  పేరును కార్పొరేటర్‌  వద్దిరాజు గణేశ్‌ ప్రతిపాదించారు. ఇతర కార్పొరేటర్లు ఏకగ్రీవంగా బలపరిచి ప్రకాశ్‌కు మద్దతు తెలిపారు. దీంతో మేయర్‌గా గుండా ప్రకాశ్‌  రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్  ప్రకటించారు. ప్రస్తుతం 26వ డివిజన్ కార్పరేటర్‌గా ఉన్న ప్రకాశ్‌ రావు టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో  పని చేస్తున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త, భవితశ్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధిపతి అయిన ప్రకాశ్‌ బీఎస్సీ వరకు చదువుకున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా , నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా రెండు సార్లు పనిచేశారు. మేయర్ గా ఎన్నికైన ప్రకాశ్ రావుకు పలువురు టిఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు.

Gunda Prakash Rao Elect as Warangal Mayor

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: