గుర్తుండిపోయే చిత్రం ‘గుణ 369’

  ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా అనఘ హీరోయిన్‌గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో హీరో కార్తికేయ మాట్లాడుతూ “నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ‘గుణ 369’. సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు చూస్తుంటే భవిష్యత్తులో మంచి హిట్స్ ఇవ్వగలననే ధైర్యం వచ్చింది. ఆ […] The post గుర్తుండిపోయే చిత్రం ‘గుణ 369’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా అనఘ హీరోయిన్‌గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో హీరో కార్తికేయ మాట్లాడుతూ “నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ‘గుణ 369’. సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు చూస్తుంటే భవిష్యత్తులో మంచి హిట్స్ ఇవ్వగలననే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని నింపిన దర్శకుడికి ధన్యవాదాలు”అని అన్నారు.

దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “కథను నమ్మి ఈ సినిమా చేసిన కార్తికేయకు ధన్యవాదాలు. తన నటన గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. యూత్, లేడీస్ అందరూ మెచ్చుకుంటున్నారు”అని తెలిపారు. నిర్మాత ప్రవీణ కడియాల మాట్లాడుతూ “ప్రతి శుక్రవారం గోడల మీద పోస్టర్లు పడుతూనే ఉంటాయి. కొన్ని మాత్రం మనసుల్లో గుర్తుండిపోతాయి. మా ‘గుణ 369’ అలాంటి చిత్రమే”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు మహేశ్, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ తదితరులు పాల్గొన్నారు.

Guna 369 Cinema Success Meet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుర్తుండిపోయే చిత్రం ‘గుణ 369’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: