నటి కంగన ఇంటి సమీపంలో కాల్పులు

Gun Firing Near Actress Kangana Ranaut Houseసిమ్లా : ప్రముఖ బాలీవుడ్ నటి కంగనరనౌత్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగాయి. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వచ్చి పరిస్థితిని పరిశీలించి, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలీలో కంగన రనౌత్ కు ఓ ఇల్లు ఉంది. ఈ ఇంటికి సమీపంలో శుక్రవారం కాల్పులు జరగడం కలకలం రేపింది. కాల్పులు జరిగినప్పుడు కంగన ఆ ఇంట్లోనే ఉంది. దీనిపై కంగన స్పందించారు. కాల్పులు జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఆ తుపాకీ చప్పుళ్లు అని తనకు మొదట అర్థం కాలేదని, రెండో సారి కాల్పుల శబ్ధాలు రావడంతో జరగడంతో దుండగులు కాల్పులు జరిపినట్టు అర్థం చేసుకున్నట్టు ఆమె వివరించారు. ఎవరో తనను బెదిరించేందుకు ఈ కాల్పులు జరిపి ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. కంగనకు రక్షణ కలిపించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నటి కంగన ఇంటి సమీపంలో కాల్పులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.