గల్ఫ్ బాధితుల ఆందోళన బాట

హామీలిచ్చే పార్టీలకే మద్దతు ఇవ్వాలని పిలుపు మాట విస్మరించిన పార్టీని నిలదీయాలని అభ్యర్థన గ్రామాల్లో వెలుస్తున్న ఫెక్సీలు, వాల్‌పోస్టర్లు మన తెలంగాణ/నిర్మల్: గత కొన్నేళ్ల నుండి గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్న వారికే కాకుండా స్థానికంగా ఉంటున్న వారి కుటుంబాలను పూర్తిగా ఆదుకునే రాజకీయ పార్టీకే మద్దతు ఇవ్వాలంటూ గల్ఫ్ వర్కర్స్ అవే ర్నెస్ సెంటర్, ఎన్‌ఆర్‌ఐ పాలసీ అవగాహన వేదిక సంస్థలు ఆయా గ్రా మాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ బ్యానర్లు చర్చనీయాంశమవుతున్నా యి. ఈ రెండు […]

హామీలిచ్చే పార్టీలకే మద్దతు ఇవ్వాలని పిలుపు
మాట విస్మరించిన పార్టీని నిలదీయాలని అభ్యర్థన
గ్రామాల్లో వెలుస్తున్న ఫెక్సీలు, వాల్‌పోస్టర్లు

మన తెలంగాణ/నిర్మల్: గత కొన్నేళ్ల నుండి గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్న వారికే కాకుండా స్థానికంగా ఉంటున్న వారి కుటుంబాలను పూర్తిగా ఆదుకునే రాజకీయ పార్టీకే మద్దతు ఇవ్వాలంటూ గల్ఫ్ వర్కర్స్ అవే ర్నెస్ సెంటర్, ఎన్‌ఆర్‌ఐ పాలసీ అవగాహన వేదిక సంస్థలు ఆయా గ్రా మాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ బ్యానర్లు చర్చనీయాంశమవుతున్నా యి. ఈ రెండు సంస్థలు గల్ఫ్ బాధిత కుటుంబాలను ఏకతాటిపై నడిపి వీరందరిని బలీయమైన ఓట్ల శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాయంటున్నారు. గత కొన్ని రోజుల నుండి నిర్మల్ జిల్లాకు చెందిన దొనికెని కృష్ణ, గోనే నవిన్, వంశీగౌడ్  తదితరులు ఎన్‌ఆర్‌ఐ పాలసీ కోసం గల్ఫ్‌లోని అబుదాబి కేంద్రంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. వీరు సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకొని ఎన్‌ఆర్‌ఐ పాలసీపై గల్ఫ్ దేశాల్లోని కార్మికులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. నిరసన కార్యక్రమాలతో పాటు సభలు సమావేశాలతో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలుపై ఇచ్చిన హామీని నెలబెట్టుకోవాలని ఈ వేదికలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీరందరూ గల్ఫ్ దేశాల్లో ఆందోళనలతో ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కొనసాగించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికలను లక్షంగా చేసుకొని అన్ని పార్టీలకు ఎన్‌ఆర్‌ఐ పాలసీని ఏజెండాగా చూపాలని నిర్ణయించాయి. ఎన్‌ఆర్‌ఐ పాలసీపై ఓవైపు నిలదీస్తునే మరో వైపు ఆ పాలసీకి మద్దతు ఇవ్వడమే కాకుండా గల్ఫ్ బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయాలని వీరంతా తమ కుటుంబాలను కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించినట్లు తెలిసింది. దీని కారణంగా ఆయా గ్రామాల్లో ఫ్లెక్సీ బ్యానర్లు, వాల్‌పోస్టర్లు వెలుస్తున్నాయంటున్నారు.
ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లాలో దాదాపు 30వేల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం జీవిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇక్కడి వీరి కుటుంబసభ్యుల ఓట్లు అన్ని పార్టీల గెలుపోటములను శాసించే పరిస్థితుల్లో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.

Comments

comments

Related Stories: