విలువల మార్గదర్శి…పుస్తకం…

  ఖమ్మం కల్చరల్ : అక్షరాలను తనలో అందంగా దాచుకున్న తరగని గని. పదాలతో పలుకరించే నేస్తం పుస్తకం. ఒక్క సిరా చుక్కతో కోటిమందిని ఆలోచింపచేస్తుంది. ప్రపంచాన్ని మన ముందు నిలబెడుతుంది. పుస్తక పఠనంతో మనిషి మేధస్సు పెరుగుతుంది. వీసా లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే అది కేవలం పుస్తకంతోనే సాధ్యం. చరిత్రను చెపుతూ భవిష్యత్‌ను గుర్తుచేస్తుంది. చిరిగిన చొక్కా అయిన తొడుక్కో, కానీ ఒక మంచిపుస్తకం కొనుక్కో అన్నాడు  కందుకూరి వీరేశిలింగం. మేధావులంతా ఏదో ఒక […] The post విలువల మార్గదర్శి…పుస్తకం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం కల్చరల్ : అక్షరాలను తనలో అందంగా దాచుకున్న తరగని గని. పదాలతో పలుకరించే నేస్తం పుస్తకం. ఒక్క సిరా చుక్కతో కోటిమందిని ఆలోచింపచేస్తుంది. ప్రపంచాన్ని మన ముందు నిలబెడుతుంది. పుస్తక పఠనంతో మనిషి మేధస్సు పెరుగుతుంది. వీసా లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే అది కేవలం పుస్తకంతోనే సాధ్యం. చరిత్రను చెపుతూ భవిష్యత్‌ను గుర్తుచేస్తుంది. చిరిగిన చొక్కా అయిన తొడుక్కో, కానీ ఒక మంచిపుస్తకం కొనుక్కో అన్నాడు  కందుకూరి వీరేశిలింగం. మేధావులంతా ఏదో ఒక పుస్తకానికి ప్రభావితం అయినవారే. ఆ ప్రభావంతో తమ జీవన గమనాన్ని కూడా మార్చుకున్నారు. చదువులమ్మ నీడలో ఓనమాలు నేర్చినవారంతా చేతిలో ఎప్పుడూ పుస్తకంతో దర్శనమిచ్చినవారే. కంప్యూటర్ కాలంలోనూ ప్రాధాన్యత కోల్పోలేదంటే పుస్తకానికి గల ప్రాధాన్యత ఎంతటిదో అర్దమౌతోంది. చరిత్ర మొదలుకుని పోటీపరీక్షల వరకు ఏ విషయం తెలియాలన్నా పుస్తకం చూడాల్సిందే. ఇంటర్‌నెట్‌లో సమాచారం లబించినా పుస్తకాలు చదివేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బుక్‌ఫెయిర్ జరిగినా యువకుల నుండి చక్కని స్పందన లభించటం చూస్తుంటాం. ఓ సారి వెళితే అక్కడ లక్షల పుస్తకాలు మనల్ని పలుకరిస్తుంటాయి. పుస్తకం గొప్పదనం తెలుసుకున్న ఎందరో సాహితీప్రియులు, పరిశోధకులు తమ పుస్తకాలను గ్రంధాలయాలకు బహుమతులుగా ఇస్తున్నారు. పుస్తక మహాత్యాన్ని నేటి తరానికి మరింత తెలియజేసేందుకు చాలా మంది పుస్తక భాండాగారాలు ఏర్పాటుచేసి అవసరమైనవారికి ఉచితంగా అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న లైబ్రరీలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. చిన్నతనం నుండే పిల్లలకు పుస్తకాలపై ఆసక్తి పెంచాలంటున్నారు నిపుణులు. టివిలు, ఇంటర్‌నెట్‌లతో ఎక్కువ సమయం గడుపుతున్న చిన్నారులతో పుస్తకాలు చదివింపచేయడం వల్ల భవిష్యత్‌కు బాటలు వేయవచ్చని అంటున్నారు మేధావులు. ఒక్క సారి తలదించి చూడు తల ఎత్తుకునేలా చేస్తానంటుంది పుస్తకం. పుస్తకం పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకుంటే మనసు, ఆలోచనా విధానం కూడా పాజిటీవ్‌గా సాగి చక్కటి భవిష్యత్‌వైపు జీవితం పయనిస్తుందని అంటున్నారు. అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్బంగా కొంతమంది పుస్తక ప్రియుల అభిప్రాయాలు వారి మాటల్లోనే చదువుదాం…
మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం:
ఇరవైయేళ్ల జీవితం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధపఠనం నేర్పిస్తుంది. పుస్తకం విలువను ధర కంటే కూడా ఉపయోగంలోనే తెలుస్తుంది. నేటి యువతలో పుస్తక పఠనాసక్తి తగ్గటానికి మొబైల్స్ ప్రధాన కారణం. ఈ రోజు ఎన్ని ఇళ్లల్లో పుస్తకాలు కనిపిస్తున్నాయి, ఇంటి లైబ్రరీలనేవి నిన్నమొన్నటిదాకా ప్రతి ఇంట్లోను ఉండేవి. నేడు అలాంటివి కనిపిస్తున్నాయా..?నేటి తరం యువతను పుస్తకం గురించి అడిగితే ఫేస్ బుక్ గురించి చెపుతారే తప్ప పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని అందించే పుస్తకాలు గురించి చెప్పుతున్నారా…? అలోచించాలి. విజ్ఞానాన్ని అందించే పుస్తకంపై చిన్నచూపు తగదు. అప్పట్లో ఊరికో లైబ్రరీ ఉండేది, కాలనీల్లో పుస్తకాలను అద్దెకిచ్చే లైబ్రరరీలూ ఉండేవి. పాఠశాలల్లో తెలుగు సాహిత్యంపై పెద్దగా పరిచయం చేయకపోవడమే పుస్తకపఠనంపై ఆసక్తి తగ్గడానికి ఒక కారణమని చాలా మంది చెపుతున్నారు. విలువలు నేర్పిస్తూ మంచి మార్గదర్శిగా ఉండే పుస్తకాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు.
పుస్తకాన్ని దైవ స్వరూపంగా భావించాలి :
హస్తభూషణమని, విజ్ఞాన సర్వస్వమనీ పొగడ్తేకాని పుస్తకాన్ని దైవస్వరూపంగా భావించేవారు బహు తక్కువ. చదివేవాళ్లు లేక కొన్ని ప్రాంతాల్లో గ్రంధాలయాల్లో పుస్తకాల షెల్ప్‌లు దుమ్మూధూళితో నిండిపోయాయి. కేవలం దినపత్రికలకు పరిమితమవుతున్నారు. సాంకేతికత వెంట పడుతున్న యువత విజ్ఞానాన్ని, సంస్కారాన్ని పంచే పుస్తకాలను విస్మరిస్తోంది. పుస్తక పఠనం, సాహితీ గ్రంధాల అధ్యయనం విషయంలో ఈ తరం యువత చాలా నిర్లక్ష్యంగా ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. నెలకు ఒకటి లేదా రెండు పుస్తకాలు చదివే వారు కూడా లేరంటే మనం ఎంత బిజీ లైఫ్‌ను గడుపుతున్నామో అర్దం చేసుకోవాలి. ఒకపుడు కళకళలాడిన గ్రంధాలయాలు ఇపుడు రీడర్లు లేక బోసిపోతున్నాయి.
పుస్తకాలు సమాచార వారధి :
పుస్తకాలంటే కేవలం టెక్ట్స్ బుక్స్ అని లేదా పోటీపరీక్షల కోసం అవసరమైనవని గిరి గీసుకుని అక్కడే ఆగిపోతుంది నేటి యువత. సాంకేతిక అతిగా వాడుకలోకి వచ్చాక బుక్ అంటే ఫేస్‌బుక్ అనుకునే పరిస్తితి కూడా వచ్చిందంటున్నారు కొందరు. పుస్తకాలు సమాచార వారధి, గతంలో కేవలం పుస్తకాల ద్వారానే విజ్ఞానం అందేది. కానీ టెక్నాలజీ కారణంగా మాద్యమాలు పెరిగాయి. పత్రికలు, టివి, సినిమా, ఇంటర్‌నెట్ తదితర వివిధ మాద్యమాల నుండి సమాచారం అందుతున్నప్పటికీ రెఫరెన్స్‌కోసం పుస్తకాలను మించింది లేదని సాంకేతిక నిపుణులే చెపుతున్నారు. ఈ మాధ్యమాలేవీ పుస్తకాలతో సమానంగా విజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించటంలేదనే నిర్వివాదాంశం. సృజనాత్మకతను పెంచే పుస్తక పఠనంపై ఇప్పటికైనా యువత శ్రధ్ద చూపాలి.
పుస్తక పఠనంతో జీవితంలో అనూహ్య మార్పులు :
గతంలో ఏ సందేహం వచ్చినా లైబ్రరీలకు వెళ్లేవారు. ఇపుడు గూగుల్‌లో వెతికేస్తున్నారు. సమయం వృదా కాకుండా డౌట్ తీరిపోతుంది. ఇదే టెక్నాలజీ పుస్తకాలకు శాపంగా మారింది. మహిళలు, పెద్దలు టి.వి సీరియళ్లకు బానిసలైతే యువత ఇంటర్‌నెట్‌కు దాసోహం అంటుంది. ఇక పుస్తకాలను ఎవరు చదువుతారు. టెక్నాలజీ వలలో పడి విలువైన పుస్తకాలను లైబ్రరీకే పరిమితం చేస్తున్నారు. ఒకపుడు యువత చేతిలో సామాజిక, సాహిత్య రంగ ప్రముఖుల పుస్తకాలు ఉండేవి, చదివిన పుస్తకాల గురించి చర్చలు సాగేవి. ఏ ఇద్దరు కలిసినా కొత్తగా ఏవైనా పుస్తకాలు చదివావా అని మాట్లాడుకునేవారు. కానీ ఇపుడు క్రికెట్ స్కోరెంత, లేటెస్ట్‌గా ఏ సినిమా చూసావ్ అన్న మాటలే వినిపిస్తున్నాయి. దీని వల్ల పుస్తకాలు చదవాలన్న ఆలోచనే నేటి యువతకు రావటం లేదు. పుస్తకపఠనంతో జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయనటంలో సందేహం లేదు.

 

Guide to values ​​… book

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విలువల మార్గదర్శి…పుస్తకం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: