‘వినయ విధేయ రామ’ అతిథులు వీరేనట?

VVR Movie Audio Launch

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ మూవీ టీజర్ రెండు రోజుల కిందట విడుదలై సెన్సషన్స్ క్రియేట్ చేస్తోంది. టీజర్ రిలీజైన 24 గంటల్లో 15 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌ని సాధించడం విశేషం. ఈ విష‌యాన్ని చిత్ర‌బృంద‌మే అధికారికంగా ప్ర‌క‌టించింది. ‘వినయ విధేయరామ’ టైటిల్ అయితే సాఫ్ట్ గా ఉంది కానీ టీజర్ మాత్రం ఊర మాస్ అనే చెప్పాలి. టీజర్ లో చెర్రీ చెప్పిన ‘రామ్ కొ.ణి.దె.ల’ డైలాగ్ బాగా పేలింది. ప్రస్తుతం ఈ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. కాగా, మరో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసింది.

మిగిలిన ఈ రెండు సాంగ్స్ డిసెంబర్ నెలలో షూట్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. అనంతరం ఆడియో విడుదల వేడుకను డిసెంబర్ చివరలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది కూడా చరణ్ కు అచొచ్చిన విశాఖలో ఆడియో విడుల చేస్తే బావుంటుందని నిర్మాతల ఆలోచనట. ఎందుకంటే ‘రంగస్థలం’ చిత్రం ఆడియో ఈవెంట్ కూడా విశాఖలోనే జరగగా ఆ మూవీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దీంతో సెంటిమెంటట్ ‘వివిఆర్’ ఆడియో వేడుకను సైతం అక్కడే నిర్వహించాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చారట.

ఇక ఈ ఆడియో ఈవెంట్ కు తండ్రి మెగా స్టార్ చిరంజీవితో పాటు తారక్, ఎస్ఎస్ రాజమౌళిలను పిలవాలనేది చరణ్ ప్లాన్ గా తెలుస్తోంది. త్వరలోనే ఈ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేస్తారని సమాచారం. ఇప్పటికే చెర్రీ, ఎన్టీఆర్ లతో జక్కన్న భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్, దర్శకధీరుడు వివిఆర్ ఆడియో వేడుకకు వస్తే మూవీపై మంచి బజ్ క్రియేట్ చెయ్యోచ్చు అనేది చెర్రీ, బొయపాటి ఆలోచన కావొచ్చు.  ‘వినయ విధేయరామ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే సంక్రాంతికి భారీగా రిలీజ్ కానుంది.

Guest for Vinaya Vidheya Rama Movie Audio Launch?

Telangana Breaking News