30వ అంతస్తు నుంచి దూకి జిఎస్‌టి అధికారి ఆత్మహత్య

  ముంబయి: జిఎస్‌టి అధికారి 30వ అంతస్తు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. హరేంద్ర కపాడియా (51) అనే వ్యక్తి కఫ్ పారేడ్ వద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హరేంద్ర కపాడియా సంవత్సరం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కోకిలబెన్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌కు సర్జరీ చేసుకున్నాడు. గత మూడు నెలల క్రితం హరేంద్ర ఆరోగ్యం కుదట పడడంతో ఉద్యోగంలో […] The post 30వ అంతస్తు నుంచి దూకి జిఎస్‌టి అధికారి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: జిఎస్‌టి అధికారి 30వ అంతస్తు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. హరేంద్ర కపాడియా (51) అనే వ్యక్తి కఫ్ పారేడ్ వద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హరేంద్ర కపాడియా సంవత్సరం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కోకిలబెన్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌కు సర్జరీ చేసుకున్నాడు. గత మూడు నెలల క్రితం హరేంద్ర ఆరోగ్యం కుదట పడడంతో ఉద్యోగంలో చేరాడు. మతిమరుపుతో బాధపడుతూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. దీంతో సోమవారం 30వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని స్థానిక పోలీసులు వెల్లడించారు.

 

GST Officer Commit Suicide from World Trade Center  

The post 30వ అంతస్తు నుంచి దూకి జిఎస్‌టి అధికారి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: