సగం రోజులు సరస్సులోనే..!

వారాంతంలో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచించే తల్లిదండ్రులకు మొదట గుర్తొచ్చేది పార్కులే! చిన్నాపెద్దా ఆటలతో పార్కు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని పార్కుల్లో బోటింగ్ సరస్సులు కూడా ఉంటాయి. ఏదో కొంత ప్రదేశంలో సరస్సులు ఉండటం సహజమే కానీ పార్క్ మొత్తం సరస్సుగా మారితే.. ఈ వింత ప్రదేశం ఆస్ట్రియాలోని ట్రాగొయిస్ ప్రాంతంలో ఉంది. ఇక్కడి మంచు పర్వతాల సమీపంలో గ్రూనర్ సీ అనే పార్కు ఉంది. ఈ పార్కు ఆరు నెలలు పచ్చని చెట్లతో, […]

వారాంతంలో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచించే తల్లిదండ్రులకు మొదట గుర్తొచ్చేది పార్కులే! చిన్నాపెద్దా ఆటలతో పార్కు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని పార్కుల్లో బోటింగ్ సరస్సులు కూడా ఉంటాయి. ఏదో కొంత ప్రదేశంలో సరస్సులు ఉండటం సహజమే కానీ పార్క్ మొత్తం సరస్సుగా మారితే.. ఈ వింత ప్రదేశం ఆస్ట్రియాలోని ట్రాగొయిస్ ప్రాంతంలో ఉంది. ఇక్కడి మంచు పర్వతాల సమీపంలో గ్రూనర్ సీ అనే పార్కు ఉంది. ఈ పార్కు ఆరు నెలలు పచ్చని చెట్లతో, పిల్లల కేరింతలతో కనిపిస్తే, మిగతా ఆరు నెలలు నీటిలో మునిగి ఉంటుంది. ఎలా అంటే వసంతకాలం మొదలవ్వగానే పక్కనే ఉన్న మంచు పర్వతాలు కరిగి ఆ నీరంతా పార్కులోకి వస్తుందట! దాంతో పార్కు మొత్తం నీటితో నిండిపోతుంది. అయితే ఆ సమయంలో కూడా స్కూబా డైవింగ్ ద్వారా పార్కును చుట్టేస్తున్నారట సందర్శకులు. జూలై వచ్చేసరికి నెమ్మదిగా పార్కు నేల తిరిగి బయటపడుతుందట! ఇలా పార్కుగా, సరస్సుగా మారుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది గ్రూనర్ సీ పార్కు!

Grüner See

Related Images:

[See image gallery at manatelangana.news]