జర్నలిస్టు నోట్లో మూత్రం పోశారు…

లక్నో : ఓ జర్నలిస్టుపై జిఆర్ పి పోలీసులు దాష్ఠికానికి పాల్పడ్డారు. అకారణంగా జర్నలిస్టుపై దాడి చేసి, బలవంతంగా అతడితో మూత్రం తాగించారు. ఈ ఘటన యుపిలోని దిమన్ పూరా వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దిమన్ పురా వద్ద మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో జర్నలిస్టు అమిత్ శర్మ ఆ ఘటనను కవరేజ్ చేసేందుకు ఘటనాస్థలికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న జిఆర్ పి పోలీసులు శర్మపై […] The post జర్నలిస్టు నోట్లో మూత్రం పోశారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో : ఓ జర్నలిస్టుపై జిఆర్ పి పోలీసులు దాష్ఠికానికి పాల్పడ్డారు. అకారణంగా జర్నలిస్టుపై దాడి చేసి, బలవంతంగా అతడితో మూత్రం తాగించారు. ఈ ఘటన యుపిలోని దిమన్ పూరా వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దిమన్ పురా వద్ద మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో జర్నలిస్టు అమిత్ శర్మ ఆ ఘటనను కవరేజ్ చేసేందుకు ఘటనాస్థలికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న జిఆర్ పి పోలీసులు శర్మపై దాడి చేసి అతడి వద్ద ఉన్న కెమెరాను లాక్కున్నారు. అనంతరం అతడితో బలవంతంగా మూత్రం తాగించారు. శర్మను అరెస్టు చేసి జిఆర్ పి స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జర్సలిస్టులు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. బుధవారం ఉదయం శర్మను విడుదల చేశారు. రైల్వేలో అనధికారిక వ్యాపారులపై కథనాన్ని ప్రచురించినందుకే తనపై పోలీసులు దాడి చేశారని శర్మ తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. జర్నలిస్టు శర్మపై దాడి చేసిన ఎస్‌హెచ్‌వో రాకేశ్ కుమార్, కానిస్టేబుల్ సునీల్ కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

GRP Police Attack On Journalist In UP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జర్నలిస్టు నోట్లో మూత్రం పోశారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: