పెట్టుబడులు, ఉపాధి సృష్టి

Nirmala Sitharaman

 

కార్పొరేట్ పన్ను తగ్గింపు లక్షమిదే
స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగాయి
ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందనే ఆందోళన అవసరంలేదు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

ముంబై: ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం లక్షం పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడమేనని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో పన్ను చట్టం సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీతారామన్ స్పందిస్తూ, బహుళ జాతీయ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పలు కంపెనీలు సేవలను మార్పు చేసేందుకు ఇతర దేశాలవైపు చూస్తున్నాయని, దీని కోసమే పన్నును తగ్గించామని ఈ బిల్లుపై మంత్రి వివరణ ఇచ్చారు. నవంబర్ నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగాయని, కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల ఆదాయం వసూళ్లు తగ్గుతాయనే ఆందోళనలను మంత్రి కొట్టిపారేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి 5 శాతం మేరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయని, చారిత్రకంగా గత ఏడాది ఇదే సమయంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని సీతారామన్ వివరించారు. కార్పొరేట్ పన్ను తగ్గించిన తర్వాత అనేక దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందు వచ్చాయని అన్నారు. కార్పొరేట్ పన్ను 34.94 శాతం నుంచి 25.17 శాతానికి తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా చర్చలు జరుగుతోంది. ద్రవ్యలభ్యతపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ, ఇటీవల చేపట్టిన రుణ మేళాలో బ్యాంకులు దాదాపు రూ.2.5 లక్షల కోట్లు రుణాలను పంపిణీ చేశాయని అన్నారు.

దీనిలో రూ.1.5 లక్షల కోట్లు తాజా టర్మ్ లోన్లు ఉన్నాయి. ప్రభుత్వం విమర్శలను వినేందుకు సుముఖంగా లేదనడం సరికాదని, సర్కారు ప్రతి అంశాన్ని వింటుందని, సమాధానమిస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు దేశీయ పరిశ్రమ భయపడుతోందని పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమె ఈవిధంగా స్పందించారు. రాయితీ పన్ను ప్రయోజనం కోసం కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ మైనింగ్ వృద్ధిలో కంపెనీలతో ఒప్పందం, స్లాబ్స్‌లోకి మార్బుల్ బ్లాక్స్ మార్పు, గ్యాస్ సిలిండర్ బాటిలింగ్, పుస్తకాల ముద్రణ, సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ వంటివి కొత్త తయారీ సంస్థలుగా పరిగణించడం లేదని అన్నారు.

Gross direct tax collection rises by 5% till November

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెట్టుబడులు, ఉపాధి సృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.