పచ్చదనమే చివరి కోరిక

  గుజరాత్‌కు చెందిన 27 సంవత్సరాల శృచీ వడాలియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు పదిమందిని కలుపుకుని వేలాది మొక్కలు నాటే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే 35వేల మొక్కలు నాటింది. ఇలాంటి మంచి నిర్ణయానికి రావడానికి కారణం ఆమె ఆరోగ్యపరిస్థితే. శృచి ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతోంది. ముంబయిలో అక్క దగ్గర చదువుకునే రోజుల్లో ఆమె ఈ వ్యాధికి గురైనట్లు తెలుసుకుంది. 2012 డిసెంబరులో మిథిబాయ్ కాలేజీలో స్నేహితులతో కలిసి ప్రాజెక్టు గురించి చర్చిస్తుంది. అకస్మాత్తుగా కళ్లు […] The post పచ్చదనమే చివరి కోరిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గుజరాత్‌కు చెందిన 27 సంవత్సరాల శృచీ వడాలియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు పదిమందిని కలుపుకుని వేలాది మొక్కలు నాటే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే 35వేల మొక్కలు నాటింది. ఇలాంటి మంచి నిర్ణయానికి రావడానికి కారణం ఆమె ఆరోగ్యపరిస్థితే. శృచి ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతోంది. ముంబయిలో అక్క దగ్గర చదువుకునే రోజుల్లో ఆమె ఈ వ్యాధికి గురైనట్లు తెలుసుకుంది.

2012 డిసెంబరులో మిథిబాయ్ కాలేజీలో స్నేహితులతో కలిసి ప్రాజెక్టు గురించి చర్చిస్తుంది. అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమె మెదడులో క్యాన్సర్ కంతులు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అప్పటికి శృచి అమ్మానాన్నలు విదేశాల్లో ఉన్నారు. అమెరికాలో చికిత్స తీసుకుంది. మూడేళ్లలో 36సార్లు కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకుంది. ఆఖరికి ఆమె శరీరం చికిత్సకు తట్టుకోలేని స్థితికి చేరింది. బతకడం కష్టమన్నారు వైద్యులు.

అయినా ఆమె ధైర్యాన్ని వీడలేదు. బతికి ఉన్ననాళ్లు సమాజానికి ఉపయోగపడే పనిచేయాలనుకుంది. కుటుంబం సహకారంతో డిగ్రీ పూర్తిచేసింది. ఆ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలనుకుంది. ఇలా మూడేళ్లక్రితం ఈ పని ప్రారంభించింది. మొదట్లో అమ్మతో కలిసి ఇంటింటికి వెళ్లి మొక్కలిచ్చేది. పారిశ్రామికవాడలు, మురికివాడలని ఎంపిక చేసుకుని మొక్కలను నాటుతుంది. పరిసర గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి మొక్కలను నాటి, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. ‘క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా’ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోంది.

చిన్నప్పటి స్నేహితుడు సారంగ్ హుజాతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరూ కలిసి సూరత్‌లోని గ్రామాల్లో మొక్కలు నాటుతున్నారు. శృచి మృత్యువుకు దగ్గరలో ఉంది. కానీ మొక్కలు నాటే పని మాత్రం మానలేదు. బతికి ఉన్నంతవరకు ఈ పనిని ఆపేది లేదంటోంది. రోజుకొక పాఠశాలకు వెళ్లి మొక్కలు నాటి, అక్కడి చిన్నారులకు పచ్చదనం ఆవశ్యకతను వివరిస్తోంది.

Greenery is the last wish

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పచ్చదనమే చివరి కోరిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: