ఎస్‌జిటి పోస్టులభర్తీకి గ్రీన్ సిగ్నల్

  షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యాశాఖ ఈనెల 5న ఎంపికైన వారి మెరిట్ జాబితా వెల్లడి ఈనెల 6న ధృవపత్రాల పరిశీలన ఈనెల 8న కౌన్సెలింగ్, పోస్టింగ్ కేటాయింపు ఖాళీలను గుర్తించి అదేరోజు ఖాళీల వివరాల ప్రకటన ఖమ్మం : ఎట్టకేలకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం 2017లో నిర్వహించిన టిఆర్‌టి రిక్రూట్ మెంట్‌లో ఎస్‌జిటి పోస్టులకు […] The post ఎస్‌జిటి పోస్టులభర్తీకి గ్రీన్ సిగ్నల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యాశాఖ
ఈనెల 5న ఎంపికైన వారి మెరిట్ జాబితా వెల్లడి
ఈనెల 6న ధృవపత్రాల పరిశీలన
ఈనెల 8న కౌన్సెలింగ్, పోస్టింగ్ కేటాయింపు
ఖాళీలను గుర్తించి అదేరోజు ఖాళీల వివరాల ప్రకటన

ఖమ్మం : ఎట్టకేలకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం 2017లో నిర్వహించిన టిఆర్‌టి రిక్రూట్ మెంట్‌లో ఎస్‌జిటి పోస్టులకు హాజరైన వారికి పోస్టింగ్‌లను కేటాయించలేదు. టి ఆర్‌టి17లో ఎంపికైన స్కూల్ అసిస్టేంట్, భాషా పండితులకు ఇటీవలనే కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఎస్‌జిటి పోస్టుల భర్తీపై కోర్టు వివాదంలో ఉన్నందున వారికి నియామక పత్రాలను అందజేయలేదు. ఎజెన్సీ, నాన్ ఎజెన్సీ సర్టిఫికేట్‌పై కోర్టులో వివాదం ఉంది. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ ఎస్‌జిటిలకు కూడా పోస్టింగ్ కేటాయించాలని ఆదేశిస్తూ ఇందుకు ఉంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 153 ఎస్‌జిటి తెలుగు మీడియం పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈనెల 5న ఎస్‌జిటి పోస్టులకు ఎంపికైన వారి జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. అదేరోజు ఉమ్మడి పూర్వ జిల్లాలోని ఖాళీలను గుర్తిస్తారు. ఈనెల 6న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి మీడియం వారిగా, కేటగిరి వారిగా ఖాళీలను గుర్తించి అదేరోజు ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. అదేరోజు ఎంపికైన అభ్యర్థుల ఒరిజినిల్ ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. ఈనెల8న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను కేటాయిస్తారు. ఈ నెల 9న పోస్టింగ్ పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరి ప్రధానోపాధ్యాయుడికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈనెల13న విధుల్లో చేరిన కొత్త ఉపాధ్యాయులను సంబంధిత ఎంఈఓ గుర్తించి జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈనెల14న కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన వారికి నియామక ఉత్తర్వులను రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తారు. ఈనెల 16న ఉద్యోగంలో చేరిన వారి జాబితాను జిల్లా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 17న ఉద్యోగంలో ఎవరూ చేరలేదో తెలియజేస్తూ వాటికి సంబంధించిన వివరాలను టిఎస్‌పిఎస్‌సికి నివేదించాలి. ఇటీవల పూర్వ జిల్లాలో స్కూల్ అసిస్టేంట్, భాష పండితుల పోస్టులను 105 భర్తీ చేశారు. అయితే ఇందులో నలుగురు ఉద్యోగంలో చేరలేదు.మిగిలిన 101 మంది విధుల్లో చేరి పాఠశాలలో పాఠాలు చెబుతున్నారు.

Green signal for replacement of SGT posts

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్‌జిటి పోస్టులభర్తీకి గ్రీన్ సిగ్నల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: