జకీర్ పాషా హ్యాట్సాఫ్!

Green india challenge event by MP santhosh kumar

 

ఆ వీడియో చూడగానే ఉదయాన్నే అంతులేని సంతృప్తి… నా గుండె చెమ్మగిల్లింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన జకీర్‌పాషాకు చేతులు లేకున్నా కాళ్లతో అనేక వ్యయ, ప్రయాసలకు ఓర్చి మొక్క నాటాడు. ఎవరి సాయం తీసుకోకుండానే కాళ్లతోనే గడ్డపారను ఉపయోగించి గుంత తవ్వి, మొక్క నాటి నీళ్లు పోయడం నన్ను కదలించింది. కోటికో ఒకరు ఇలాంటి ప్రశంసాపూర్వక పనులు చేసి మిలియన్ల ప్రజల నీరాజనాలు అందుకుంటారు.

– జోగినపల్లి సంతోష్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు

ఆకుపచ్చ తెలంగాణ కోసం అందరూ పాటుపడాలి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పెద్దఎత్తున మొక్కలునాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ చేసిన సవాల్‌ను స్వీకరించి ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కె,చంద్రశేఖర్ రావు హరితహారం నిర్వహిస్తూ కోట్లాది మొక్కలు నాటిస్తున్నారని చెప్పారు. అలాగే ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక మిషన్‌లా పనిచేస్తుందని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణకు అందరూ మొక్కలు నాటాలన్నారు. ప్రొఫెసర్ పాపిరెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఈకార్యక్రమంలో ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీనివాస్, గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

హరితవిప్లవం ఆవిష్కరిస్తుంది

పర్యావరణాన్ని పరిరక్షింతే బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని నల్గొండ జిల్లాకలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గుర్తు చేశారు. గ్రీన్‌ఇండియాఛాలెంజ్‌లో భాగంగా కలెక్టర్ పాటిల్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎంకెసిఆర్ పర్యావరణానికి పెద్ద ్దపీఠవేశారని చెప్పారు. కలపవ్యాపారాన్ని పూర్తిగా అరికట్టారన్నారు. అర్బన్ పార్కుల అభివృద్ది జరుగుతుందని చెప్పారు. ఈసందర్భంగా ఆయన యాదాద్రి జిల్లాకలెక్టర్, సూర్యాపేట జిల్లాకలెక్టర్, రాచకొండ సిపికి గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.

ఆక్సిజన్ కావాలంటే మొక్కలు నాటాలి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి హిమజ ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి వర్థమాననటి ప్రవిణ జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. మనమందరం స్వచ్చమైన ఆక్సిజన్ పీల్చుకోవాలంటే మొక్కలునాటాలని ప్రణవి విజ్ఞప్తి చేశారు. అలాగే లక్ష్మీ,సింధు, విష్ణుప్రియలకు ప్రణవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు.

సాకేత్ సవాల్‌ను స్వీకరించిన గాయని పర్ణిక గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సింగర్ సాకేత్ విసిరిన సవాల్‌ను స్వీకరించి సనత్‌నగర్‌లోని తన నివాసంలో గాయని పర్ణిక మాన్య మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మనముందున్న ఛాలెంజ్ భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతి ఇవ్వడమేనని చెప్పారు. ఈసందర్భంగా ఆమె గాయకులు నోయేల్‌సేన్, శ్రీకృష్ణ, సోనీ కోమందురీలకు గ్రీన్‌ఇండియాఛాలెంజ్ విసిరారు. దీంతో పాటు తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో లక్షలాదిగా మొక్కలు నాటుతున్నారు.

The post జకీర్ పాషా హ్యాట్సాఫ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.