దిగ్విజయంగా దూసుకెళ్తోంది..

హుజూర్‌నగర్‌లో మొక్కలు నాటిన మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి సంతోష్ సహా పలువురు నేతలు,
మదురై కోయిల్‌పట్టిలో మొక్కలు నాటిన నటి ప్రియమణి

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో నటి ప్రియమణి శుక్రవారం పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో మధురైలోని కోయిల్‌పట్టిలో ప్రియమణి మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, కెమెరామెన్ శ్యాం కె నాయుడు, నటుడు రామరాజు, మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు కోసం అందరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. పెళ్లి రోజు, పుట్టిన రోజులకు బహుమతులు ఇవ్వకుండా మొక్కలు నాటించాలన్నారు.

మొక్కలు నాటిన మంత్రి జగదీష్‌రెడ్డి

హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో హరితహారంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంపి లింగయ్య యాదవ్, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎలు సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య యాదవ్, ఇతర నాయకులు మొక్కలు నాటారు.

The post దిగ్విజయంగా దూసుకెళ్తోంది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.