చెక్ పవర్ రాక పరేషన్

  ఆదిలాబాద్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు అవుతున్న చెక్‌పవర్ రాకపోవడంతో గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేక ఇబ్బంది పడుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉత్సాహంతో అభివృద్ది చేద్దామని ముందుకు వచ్చారు. ఇంకా చెక్‌పోవర్ వారికి ఇవ్వక పోవడంతో అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న గ్రామాల్లో సమస్యలు తీరడం లేదని, నిత్యం ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక సతమతమవుతున్నమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. […] The post చెక్ పవర్ రాక పరేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు అవుతున్న చెక్‌పవర్ రాకపోవడంతో గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేక ఇబ్బంది పడుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉత్సాహంతో అభివృద్ది చేద్దామని ముందుకు వచ్చారు. ఇంకా చెక్‌పోవర్ వారికి ఇవ్వక పోవడంతో అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న గ్రామాల్లో సమస్యలు తీరడం లేదని, నిత్యం ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక సతమతమవుతున్నమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గాదిగూడ, నార్నూర్ మండలాలను కలిపి మొత్తం 48 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

మండలాల్లోని ఆయా పంచాయతీలో ఎండల తీవ్రతకు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పారిశుధ్యపనులు చేపట్టక పోవడంతో చెత్త చెదారంలో దార్శనమిస్తున్నాయి. పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వాలేని పరిస్థితులు ఉన్నాయి. వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నామని జీతాలు ఇవ్వలని కోరితే చెక్‌పవర్ వచ్చాకే ఇస్తామని చెబుతున్నారని వారు పేర్కొంటున్నారు. కొంత మంది సర్పంచ్‌లు అప్పులు చేస్తు గ్రామాల్లో పనులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైన సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇస్తే ఉత్తర్వులు జారీ చేయ్యాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్లాలి: రాథోడ్ సుభద్రబాయి కొత్తపల్లి
సర్పంచుగా బాద్యతలు చేపట్టి నాలుగు నెలలు అవుతున్న చెక్‌పవర్ రాక ఇబ్బంది పడుతున్నాం. గ్రామాల్లో అభివృద్ది పనులు చేయాలంటే ఇబ్బంది పడుతున్నామని, సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Grama Panchayat Development with Serpach Check power

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెక్ పవర్ రాక పరేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: