రైతుల లబ్ధి కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు…

  సుబేదారి: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. రైతుల నుండి మాత్రమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని చెల్లింపులను కూడా సంబంధిత రైతుల ఖాతాలకే జమచేయాలని ఆదేశించారు. గురువారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నందు అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జెపాటిల్, హరిత సంయుక్త కలెక్టర్ ఎస్.దయానంద డిఎస్‌ఒలు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు, జిల్లా సహకార […] The post రైతుల లబ్ధి కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుబేదారి: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. రైతుల నుండి మాత్రమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని చెల్లింపులను కూడా సంబంధిత రైతుల ఖాతాలకే జమచేయాలని ఆదేశించారు. గురువారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నందు అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జెపాటిల్, హరిత సంయుక్త కలెక్టర్ ఎస్.దయానంద డిఎస్‌ఒలు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు, జిల్లా సహకార అధికారులు, డిఆర్‌డిఒలతో నిర్వహించిన సమావేశంలో యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ గురించి చర్చించారు.

వరంగల్ అర్బన్‌లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 43, ఐకెపి ద్వారా 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. అలాగే రూరల్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 64, ఐకెపి ద్వారా 35 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వసతులు కల్పించాలని తెలిపారు. తాగునీరు, నీడ, టార్పాలిన్‌లు, తూకాలు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కల్పించిన సదుపాయాలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. తూకాలలో మోసాలను అరికట్టుటకు ప్రతి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులకు స్పష్టం చేశారు. అక్కడక్కడ తేమ పేరున తూకాలలో తగ్గింపులు జరుపుతున్నట్లు మిల్లర్లపై వస్తున్న విమర్శలు దృష్టి సారించాలని సూచించారు.

రైతులకు ఎటువంటి నష్టం జరగరాదని తెలిపారు. 48 గంటలలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని తెలిపారు. పౌరసరఫరాల దుకాణాల నుండి గన్నీ బ్యాగులను సేకరించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సహకరించాలని డీలర్లకు సూచించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తున్నదని, మూడు సంవత్సరాల కమీషన్ బకాయిలు కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో మిల్లర్స్‌కు పంపించిన ధాన్యం నుండి రావాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను తీసుకునేందుకు జిల్లాస్థాయిలో అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ శాంపిల్స్‌ను ముందస్తుగా ఎఫ్‌సిఐ అధికారులకు చూపించి, నాణ్యత ప్రకారం ఎఫ్‌సిఐ గోదాములకు కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను తరలించాలని అధికారులకు సూచించారు.

పర్యటనలో భాగంగా ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ మాట్లాడారు. తేమ యంత్రం పనితీరును గమనించారు. కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాజీపేట మండలం బాపూజీనగర్‌లో నెలకొల్పిన 12వ నెంబర్ చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.సంతోష్, డిఎస్‌ఒలు విజయలక్ష్మి, వనజ, పౌరసఫరాల శాఖ డిఎం కె.భాస్కర్‌రావు, డిఆర్‌డిఒ రాము, డిసిఒ నీరజ, ఎఫ్‌సిఐ అసిస్టెంట్ మేనేజర్ కురీన్ తదితరులు పాల్గొన్నారు.

Grain buying centers are for farmers’ benefit

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రైతుల లబ్ధి కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: