జెఎన్‌యు వద్ద భారీగా పోలీసుల మోహరింపు

JNU-campus

న్యూఢిల్లీ: ఫీజుల పెంపుపై జెఎన్‌యు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ సమస్యలను అధ్యయనం చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సోమవారం ఒక ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీని నియమించడానికి అంగీకరించింది. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా విద్యార్థుల ఆందోళలను పురస్కరించుకుని జెఎన్‌యు క్యాంపస్ వెలుపల పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ప్రభుత్వం మోహరించింది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పార్లమెంట్ సమీపంలో నిషేధాజ్ఞలను ప్రభుత్వం విధించింది.

యునివర్సిటీ వెలుపల పోలీసు బలగాలను పెద్దసంఖ్యలో మోహరించడంపై జెఎన్‌యు టీచర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్ హౌస్‌కు విద్యార్థులు ర్యాలీ తీయకుండా నిరోధించేందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు కనపడుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థులు క్యాంపస్ వెలుపల తమ గొంతు వినిపించేందుకు రాజ్యాంగపరంగా వారికి సంక్రమించిన ప్రజాస్వామిక హక్కులను భగ్నం చేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని టీచర్ల సంఘం విచారం వ్యక్తం చేసింది.

Govt imposes section 144 outside JNU campus, Centre forms panel on JNU Fee Hike to pacify students

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జెఎన్‌యు వద్ద భారీగా పోలీసుల మోహరింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.