ఉద్దీపన ప్యాకేజీతో బహుళ ప్రయోజనాలు

  ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది వలస కార్మికులను విస్మరించలేదు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ న్యూఢిల్లీ: రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీని ఐదు విడతలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలపై స్పందించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కరోనా వైరస్‌తో దిగ్భ్రాంతిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దోహాదం చేస్తుందని, బహుల విధాలుగా ఈ ప్యాకేజీ సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. అలాగే పేదలు, వలస కార్మికులు, బలహీన […] The post ఉద్దీపన ప్యాకేజీతో బహుళ ప్రయోజనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది
వలస కార్మికులను విస్మరించలేదు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ: రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీని ఐదు విడతలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలపై స్పందించారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కరోనా వైరస్‌తో దిగ్భ్రాంతిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దోహాదం చేస్తుందని, బహుల విధాలుగా ఈ ప్యాకేజీ సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. అలాగే పేదలు, వలస కార్మికులు, బలహీన వర్గాల వారికి తక్షణ సహాయం లభించలేదన్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. నేరుగా నగదు బదిలీ చేయడమే సమస్యకు ఏకైక పరిష్కారం కాదని, అయితే ప్రభుత్వం ప్రత్యామ్నా మార్గాల ద్వారానే వెళ్లాలని నిర్ణయించిందని అన్నారు. నగదు బదిలీ లాక్‌డౌన్ మొదట చేశామని, అయితే అదేమీ ఇంకా ముగిసిపోలేదని అన్నారు. ఒక టీవి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సీతారామన్ మాట్లాడుతూ, వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమని మంత్రి అన్నారు.

ద్రవ్య లభ్యత కల్పించడం ద్వారా సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. దీంతో ఎక్కువమంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అత్యవసర కష్టాలు తీర్చేందుకు విపత్తు నిర్వహణ నిధులు ఉపయోగించామని, శిబిరాల్లో వలస కార్మికులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. కరోనా వైరస్ భయంతో కార్మికులు సొంత ప్రాంతాలకు వెళుతున్నారని, ప్రస్తుత వారు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. రైళ్లు ఏర్పాటు చేయడంతో ఒక్కసారి వారి తాకిడి పెరిగిందని, పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం, పౌర సమాజం సమానంగా బాధ్యత వహించాలని అన్నారు.

Govt give more economic stimulus after Rs 21 l cr

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉద్దీపన ప్యాకేజీతో బహుళ ప్రయోజనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: