రూ.15 వేల కోట్ల సమీకరణ లక్షం

  18 సంస్థల్లో వాటాలను తగ్గించనున్న ప్రభుత్వం: నివేదిక న్యూఢిల్లీ: ఆదాయాన్ని పెంచి, ద్రవ్య లోటును తగ్గించేందుకు గాను పలు సంస్థల్లో వాటాలను తగ్గించడం ద్వారా రూ.15 వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. దాదాపు 18 ప్రభుత్వరంగ సంస్థల్లో 75 శాతానికి వాటాలను తగ్గించడం ద్వారా ఈ నిధులను సేకరించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమీకరించాలని లక్షంగా చేసుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి […] The post రూ.15 వేల కోట్ల సమీకరణ లక్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

18 సంస్థల్లో వాటాలను తగ్గించనున్న ప్రభుత్వం: నివేదిక

న్యూఢిల్లీ: ఆదాయాన్ని పెంచి, ద్రవ్య లోటును తగ్గించేందుకు గాను పలు సంస్థల్లో వాటాలను తగ్గించడం ద్వారా రూ.15 వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. దాదాపు 18 ప్రభుత్వరంగ సంస్థల్లో 75 శాతానికి వాటాలను తగ్గించడం ద్వారా ఈ నిధులను సేకరించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమీకరించాలని లక్షంగా చేసుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. గతేడాదిలో పెట్టుబడుల ఉపసంహరణ లక్షం రూ.85 వేల కోట్లతో తాజా లక్షంగా మరింత ఎక్కువగా ఉంది. ఎయిర్ ఇండియాతో సహా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టడం ఇది మూడోసారి. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని భావించినప్పటికీ సమీకరించిన మొత్తం రూ.85,000 కోట్లుగా ఉండటం విశేషం.

2017-18 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా మొత్తాలను సమీకరించింది. హెచ్‌పిసిఎల్‌లో 51.11 శాతం వాటాను రూ.36,915 కోట్లకు, అలాగే ఒఎన్‌జిసికి విక్రయించటం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోగలిగింది. వాస్తవానికి ఆ సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.72,500 కోట్లుగా ఉంది. కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్-, భారత్ 22 ద్వారా వరుసగా రూ.26,500 కోట్లు, రూ.18,729.85 కోట్లు సమీకరించింది. ఈ ఏడాది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌కు అనుగుణంగా ఇటిఎఫ్‌ల్లో ఇన్వెస్టమెంట్ ఆప్షన్‌ను ప్రభుత్వం ఆఫర్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Govt aims to raise 15000 cr by cutting stakes in 18 firms

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రూ.15 వేల కోట్ల సమీకరణ లక్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.