కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట…

  భూదాన్‌పోచంపల్లి : కుల వృత్తుల అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎంబిసి కార్పొరేషన్ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం గ్రామంలోగల స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో శనివారం నిర్వహించిన కుమ్మరి మాస్టర్ ట్రైనర్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మోష్ట్ బ్యాక్ వర్డ్ కుల వృత్తుల అభివృద్ధ్ది కోసం ఎంబిసి కార్పొరేషన్‌ను 1000 కోట్ల నిధులతో ఏర్పాటు చేసారని తెలిపారు. ఆధునిక యంత్రాలతో మట్టితో […] The post కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భూదాన్‌పోచంపల్లి : కుల వృత్తుల అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎంబిసి కార్పొరేషన్ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం గ్రామంలోగల స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో శనివారం నిర్వహించిన కుమ్మరి మాస్టర్ ట్రైనర్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మోష్ట్ బ్యాక్ వర్డ్ కుల వృత్తుల అభివృద్ధ్ది కోసం ఎంబిసి కార్పొరేషన్‌ను 1000 కోట్ల నిధులతో ఏర్పాటు చేసారని తెలిపారు.

ఆధునిక యంత్రాలతో మట్టితో తయారు చేస్తున్న ఉత్పత్తులపై రాష్ట్ర వ్యాప్తంగా 3500 మంది కుమ్మరులకు శిక్షణ ఇప్పించామని త్వరలోనే వారికి మట్టితో ఉత్పత్తులను తయారుచేసే ఆధునిక యంత్రాలను ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలిపారు. స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో జిల్లాకు ఐదు మంది మాస్టర్ ట్రైనర్లకు ఇప్పటికే దీపంతలు మట్టి వినాయకులు వివిధ మట్టి ఉత్పత్తులు తయారీపై శిక్షణ కల్పించామని జిల్లాలలో వీరి ద్వారా మరింత మందికి శిక్షణ ఇచ్చి వినాయక చవితి వరకు లక్షల్లో మట్టి వినాయకులు, మట్టి దీపంతలు తయారు చేసి మార్కెటింగ్ చేస్తామని ఎంబీసీ కార్పొరేషన్ సీఈఓ అలోక్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలోరాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు జయంతి రావు, ఎంపీపీ సార సరస్వతి, ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ డైరెక్టర్ కిషోర్ రెడ్డి, భువనగిరి నియోజక వర్గ ఎంబీసీ కన్వినర్ చిలివేరు బాల నర్సింహ్మ, నాయకులు యాదయ్య, రమేశ్, శ్రీనివాస్, సత్యనారాయణ, క్రిష్ణ సంస్థ సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

Government supports Development of Caste Occupations

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: