జోరుగా నిషేధిత చేపల అమ్మకాలు

  నర్సాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యాపారం చోద్యం చూస్తున్న అధికారులు అనారోగ్యం పాలవుతున్న ప్రజలు మన తెలంగాణ/నర్సాపూర్ : ప్రభుత్వ నిషేదిత క్యాట్‌ఫిష్(చేపలు) అమ్మకాలు నర్సాపూర్ పట్టణ కేంద్రంలో జోరుగా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. వ్యాపారులు అదిక లాభాలు ఆర్జించవచ్చన్న దురాశతో నిషేదిత చేపలను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అదికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. క్యాట్‌ఫిష్ మాంసం తిన్నవారు అనారోగ్యానికి గురవుతున్నారని గుర్తించిన ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా […]

 

నర్సాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యాపారం
చోద్యం చూస్తున్న అధికారులు
అనారోగ్యం పాలవుతున్న ప్రజలు

మన తెలంగాణ/నర్సాపూర్ : ప్రభుత్వ నిషేదిత క్యాట్‌ఫిష్(చేపలు) అమ్మకాలు నర్సాపూర్ పట్టణ కేంద్రంలో జోరుగా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. వ్యాపారులు అదిక లాభాలు ఆర్జించవచ్చన్న దురాశతో నిషేదిత చేపలను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అదికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. క్యాట్‌ఫిష్ మాంసం తిన్నవారు అనారోగ్యానికి గురవుతున్నారని గుర్తించిన ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా ఈ చేపలను నిషేదించింది.

అయినా వ్యాపారులు మాత్రంలాభాలు ఆర్జించవచ్చన్న నెపంతో నిషేదిత చేపలను గ్రామాల్లో అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చేపలను తిన్నవారు అనారోగ్యంకు గురవుతున్నట్లు వైద్యులు గతంలోనే వెల్లడించారు. అయినప్పటికి ఈ నిషేదిత చేపల విక్రయాలు గ్రామాల్లో విక్రయించడం అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం వల్ల ప్రజలు రోగాల భారిన పడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిషేదిత చేపలపై దృష్టిసారించి వాటిని విక్రయించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Government Prohibited Catfish Sales in Narsapur

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: