14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

  హైదరాబాద్ మెట్రోకూ మరింత విరామం న్యూఢిల్లీ : దేశం నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాల సేవలను వచ్చే నెల14వ తేదీ వరకూ రద్దు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో అధికారికంగా గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం అంతర్జాతీయ విమానాలపై వారం రోజుల నిషేధం విధించారు. అయితే దేశంలో లాక్‌డౌన్, పలు ప్రాంతాలలో వైరస్ విస్తరణతో తాజా పరిస్థితిని సమీక్షించుకుని బయటి దేశాలకు వెళ్లే విమానాల రాకపోకలను మరికొంత కాలం నిలిపివేస్తున్నారు. అయితే కార్గో […] The post 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ మెట్రోకూ మరింత విరామం

న్యూఢిల్లీ : దేశం నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాల సేవలను వచ్చే నెల14వ తేదీ వరకూ రద్దు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో అధికారికంగా గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం అంతర్జాతీయ విమానాలపై వారం రోజుల నిషేధం విధించారు. అయితే దేశంలో లాక్‌డౌన్, పలు ప్రాంతాలలో వైరస్ విస్తరణతో తాజా పరిస్థితిని సమీక్షించుకుని బయటి దేశాలకు వెళ్లే విమానాల రాకపోకలను మరికొంత కాలం నిలిపివేస్తున్నారు. అయితే కార్గో విమానాలు, పౌర విమానయాన సంస్థ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలకు నిషేధం ఉండదు. ఇప్పటికైతే దేశీయ విమానాలను ఈ నెల చివరి వరకూ నిలిపివేశారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, రాష్ట్రాలలో బస్సు సర్వీసులు కూడా రద్దు చేశారు. ఇక ఎప్రిల్ 14వ తేదీ వరకూ హైదరాబాద్ మెట్రో సేవలు రద్దు చేస్తున్నట్లు సంస్థ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే దేశంలో రైళ్లు బంద్ అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ మెట్రో సేవలు కూడా 14వరకు రద్దు చేశారు.

Government extends ban on international flights till April 14

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: