25వేల మంది రైతుల రుణ మాఫీ

145.46 కోట్లు విడుదల చేస్తూ తాజా ఉత్తర్వులు ఇంతకు ముందే వికారాబాద్ జిల్లాకు రూ. 11.5౦ కోట్లు నాడు అర్హత ఉండీ లబ్ధిపొందని రైతులకు ఊరట మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని దాదాపు 25 వేల మంది రైతులకు పంట రుణాల మాఫీని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి సోమవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. రుణమాఫీకి అవసరమైన రూ.145.68 కోట్ల విడుదలకు సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా, ఇటీవల […]

145.46 కోట్లు విడుదల చేస్తూ తాజా ఉత్తర్వులు
ఇంతకు ముందే వికారాబాద్ జిల్లాకు రూ. 11.5౦ కోట్లు
నాడు అర్హత ఉండీ లబ్ధిపొందని రైతులకు ఊరట

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని దాదాపు 25 వేల మంది రైతులకు పంట రుణాల మాఫీని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి సోమవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. రుణమాఫీకి అవసరమైన రూ.145.68 కోట్ల విడుదలకు సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా, ఇటీవల వికారాబాద్ జిల్లాకు సంబంధించి రూ. 11.50 కోట్లకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా దాదాపు రూ.160 కోట్లు రుణామాఫీకి విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాలుగు విడతలుగా పంట రుణాలు మాఫీ చేసిన విషయం తెలిసిందే. అలా 35.33 లక్షల మంది రైతుల రూ. 16,124 కోట్ల రుణాలను బ్యాంకులకు చెల్లించింది. అయితే రుణమాఫీకి అర్హులను గుర్తించే క్రమంలో బ్యాంకులు కొందరు రైతుల వివరాల జాబితాను ప్రభుత్వానికి పంపించలేదు.

అలా 25 వేల మందికి పైగా రైతులు అర్హులై ఉండి రుణమాఫీకి నోచుకోలేకపోయారు. దీంతో ఆ రైతులంతా గగ్గోలు పెట్టారు. అర్హులైన రైతులు ఉన్నందున మంత్రులు, ఎంఎల్‌ఎలు కూడా వీరికి రుణమాఫీ చేయాలని గతంలో ఆపద్ధర్మ సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ దీనిపై పలుమార్లు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరికి రుణమాఫీ అమలు చేయడానికి అప్పుడు ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. అసెంబ్లీ రద్దు కావడానికి ముందే వ్యవసాయశాఖ సంబంధిత ఫైలును సిఎం ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే సిఎం సంతకం చేసినా ఉత్తర్వులు వెలువడడానికి ఇన్నాళ్లూ పట్టిందని అధికారులు చెబుతున్నారు. 25 వేల మందికి పైగా రైతులకు దాదాపు రూ.160 కోట్లు రుణమాఫీ కానుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

Comments

comments

Related Stories: