అతడి మృతితోనే ‘2.O’కథ మొదలవుతుందట..!

‘2.0’ Movie

ప్రముఖ దర్శకుడు శంకర్ భారీ ప్రాజెక్ట్ ‘2.O’. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్ కు విలన్ గా బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలసిందే. ఇక ట్రైలర్ లో అక్షయ్ కుమార్ ను పక్షి రాక్షసుడిగా చూపించారు. స్మార్ట్ ఫోన్లపై ఆయన ద్వేషంగా ఉండడం, స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లంతా హంతకులేనని చెప్పడం, స్మార్ట్ ఫోన్లు వాడేవారి నుంచి బలవంతంగా వాటిని లాక్కోవడం చూపించారు. అయితే, అక్షయ్ అలా ఎందుకు అన్నారనే దానిపై ప్రస్తుతం బయట తెగ చర్చించుకుంటున్నారట.

అందుకు గల కారణమేమిటనే దానిపై ఇప్పుడు కోలీవుడ్ లో సమాధానం వినిపిస్తోంది. ఈ మూవీలో అక్షయ్ అదే పనిగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించడం వలన రేడియేషన్ తో చనిపోతాడట. ఇక్కడి నుంచే కథ మొదలవుతుందని బయట వినిపిస్తున్న రూమర్. అనంతరం ఒక దుష్ట శక్తిగా మారిన అక్షయ్, స్మార్ట్ ఫోన్లు వాడే వారిని టార్గెట్ చేస్తూ వారిని వెంటాడుతాడని చెబుతున్నారు. దీంతో డైరెక్టర్ శంకర్ చాలా మంచి కథ ఎంచుకున్నాడనీ, ఇది అందరినీ ఆలోచింపజేయడంతో పాటు ఆకట్టుకోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం ‘2.O’ విడుదల కానున్న నవంబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.

Gossips on 2.O Movie Story Line

Telangana Breaking News