షూటింగ్ షురూ

Gopichand Tamanna

 

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో భాగంగా అజిజ్ నగర్‌లో వేసిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. మొదటి షెడ్యూల్ అనంతరం వరుసగా రాజమండ్రి, ఢిల్లీ షెడ్యూళ్లు పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు. ఈ చిత్రానికి డిఓపి: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్ కుమార్.

Gopichand Tamanna New Movie Launch

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post షూటింగ్ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.