స్పై థ్రిల్లర్ ‘చాణక్య’

  గోపీచంద్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు తిరు… గోపీచంద్‌ను సరికొత్త పంథాలో చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జరీనాఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. 50 శాతానికి […] The post స్పై థ్రిల్లర్ ‘చాణక్య’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గోపీచంద్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు తిరు… గోపీచంద్‌ను సరికొత్త పంథాలో చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జరీనాఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. విశాల్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Gopichand 26 Chanakya First Look will be released shortly

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్పై థ్రిల్లర్ ‘చాణక్య’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: