‘టిక్ టాక్’కు గూగుల్‌ షాక్!

ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్ ‘టిక్ టాక్’. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా చాలా ఉన్న ఈ యాప్ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో ఈ యాప్ విడుదలైన అనతికాలంలోనే బాగా పాపులర్ అయింది. అయితే, చాలా మంది ఈ  యాప్ ని ఉపయోగించి సంఘవిద్రోహచర్యలకు పాల్పడుతున్నారు. దీంతో ‘టిక్ టాక్’ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘టిక్ టాక్’ యాప్‌ను ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర  […] The post ‘టిక్ టాక్’కు గూగుల్‌ షాక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్ ‘టిక్ టాక్’. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా చాలా ఉన్న ఈ యాప్ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో ఈ యాప్ విడుదలైన అనతికాలంలోనే బాగా పాపులర్ అయింది. అయితే, చాలా మంది ఈ  యాప్ ని ఉపయోగించి సంఘవిద్రోహచర్యలకు పాల్పడుతున్నారు. దీంతో ‘టిక్ టాక్’ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘టిక్ టాక్’ యాప్‌ను ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర  ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ యాప్‌పై సర్వత్రా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో దీన్ని నిషేధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే దీనిని బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించగా.. తాజాగా ‘టిక్ టాక్’ యాప్‌ను గూగుల్‌ బ్యాన్‌ చేసిందని రాయిటర్స్‌  రిపోర్ట్‌ చేసింది. ‘టిక్ టాక్’ డౌన్‌లోడ్లను నిషేధించాలనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘టిక్ టాక్’ యాప్‌ నిషేధంపై స్టే విధించాలంటూ చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్‌లో ‘టిక్ టాక్’ అందుబాటులో లేదు. అయితే యాపిల్‌  స్టోర్‌లో అందుబాటులో ఉంది. కాగా, తాజా పరిణామంపై  గూగుల్‌, యాపిల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Google blocks Chinese app TikTok in India

The post ‘టిక్ టాక్’కు గూగుల్‌ షాక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: