అప్పుడు విడాకులే పరిష్కారం!

  వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి. అది ధర్మం అనుకొనేవాళ్లు ఒక తరం. అలాగే చేసేవాళ్లు కూడా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు ఎంచి చూసి, పిల్ల సుఖపడిపోతుంది అని పెద్దవాళే నిర్ణయించి కనీసం ఈ సంబంధం నీకు ఇష్టమేనా అని కూడా అడక్కుండా పెళ్లిళ్లు చేసేవాళ్ళు. కాకపోతే ఆలోచనల్లో ఆడపిల్లలు చదువుకోక పోవటం, భర్త పైనే ఆధారపడటం వల్ల భర్త నుంచి లేదా భర్తవైపు కుటుంబం నుంచి ఎలాంటి సమస్యలు […] The post అప్పుడు విడాకులే పరిష్కారం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి. అది ధర్మం అనుకొనేవాళ్లు ఒక తరం. అలాగే చేసేవాళ్లు కూడా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు ఎంచి చూసి, పిల్ల సుఖపడిపోతుంది అని పెద్దవాళే నిర్ణయించి కనీసం ఈ సంబంధం నీకు ఇష్టమేనా అని కూడా అడక్కుండా పెళ్లిళ్లు చేసేవాళ్ళు. కాకపోతే ఆలోచనల్లో ఆడపిల్లలు చదువుకోక పోవటం, భర్త పైనే ఆధారపడటం వల్ల భర్త నుంచి లేదా భర్తవైపు కుటుంబం నుంచి ఎలాంటి సమస్యలు వచ్చినా సర్దుకుపోయేవాళ్లు. జీవితం మొత్తం తపించి పోయినా నోరు తెరచి పక్కవాళ్లతో కూడా తమ బాధను చెప్పుకొనేవాళ్లు కాదు.

ఆ తరం గడిచింది. రెండో తరం అమ్మాయిలు చదువు కొన్నారు. ఉద్యోగాలు చేయటం మొదలు పెట్టారు. వాళ్లు అప్పటికే తమ వెనక గడిచిన తరాల్లో అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని తల్లుల్ని మేనత్తల్నీ చూశారు. వారి జీవితాల్లో ఏం జరిగిందో, వాళ్లెందుకు నష్టపోయారో అర్థం చేసుకొన్నారు.

ఈ రెండో తరం కాస్త తెలివిగా మాకు ఇష్టమైతేనే అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పెళ్ళిచూపులో కాబోయే వధువు వరుడూ మాట్లాడుకోవటం, జీవితం ఇలా ఉంటే బావుండాలని కొన్ని షరతులు పెట్టుకోవడంతో వారి సంసారంలో భార్యకు కాస్త వెసులుబాటు దొరికింది.

అయితే అది పూర్వపు పెళ్లిళ్ల డిజైనే. కానీ పిల్లల్నీ చ దివించుకోవటం, కలసి ఉద్యోగాలు చేసి కాస్త కంఫర్టైన జీవితం గడపడం, ఆ స్తులు కూడబెట్టుకోవటం వరకు జరిగింది. వివాహ వ్యవస్థ అర్థం తెలుసుకొని బతికిన రెండోతరం ఆడవాళ్లు. ఇక మూడో తరం అంటే ప్రస్తుత తరం అమ్మాయిలు. వీళ్లు చదువుకొన్న తల్లిదండ్రులు దగ్గర పెరిగిన వాళ్లు. పుట్టుకతోనే స్వే చ్ఛను అందిపుచ్చుకొన్న వాళ్లు. ఒకళ్ళో ఇద్దరు కన్నా రెండోతరం తల్లిదండ్రుల ఆలోచనలను అంది పుచ్చుకొనేవాళ్లు. వాళ్లకు సుఖంగా జీవించటం తెలుసు.

తమ ఉనికిని నిలబెట్టుకోవడం తెలుసు. కెరీర్ విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు వీళ్లు. ఈ తరం అమ్మాయిల పెళ్ళిళ్ల విషయం వచ్చే సరికి వెయ్యి అబద్ధాలు కాదు కదా ఒక్క అబద్ధం ఆడినా ఆ పెళ్లిని అపహాస్యం చేసినట్లే. ఒక అబద్ధపు పునాదిపైన ఆ సంసారం నిలవదు. కానీ ఆ తప్పంతా అమ్మాయిలదే అంటున్నారు విజ్ఞులు. అమ్మాయిలు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సమానత్వం సాధించాలి. కుటుంబ వ్యవస్థలో ఇమడకపోవడం వల్లే విడాకుల వరకు పోతున్నామని ఈనాటి విశ్లేషకుల ఉవాచ.

 

 

కానీ జరుగుతున్నదేమిటీ?
చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే పెరగడం వల్ల ఎక్కువ మందిలో ఉం టే ఊపిరాడదు. సౌండ్ పొల్యూషన్ చిన్న శబ్ధం భరించలేను. గందరగోళంగా ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. పీస్‌ఫుల్‌గా జాబ్ చేసుకోవాలి.
ఈ అమ్మాయి తల్లిదండ్రులకు పది మంచి కుటుంబం టి.వి షోల్లో లాగా ఉంటే బావుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక వేడుక.

సందడి…. అనుకొన్నారనుకొందాం అప్పుడు ఏమవుతుంది?
నాకు కెరీర్ పైన దృష్టి, నేను కష్టపడి చదువుకొంది టాప్ జాబ్ ఏ దో చేయాలి. నాకు క్యాబిన్ ఉండాలి. నా కింద ఎంతో మంది పనిచేయాలి. జీ వితంలో నాకు ప్రత్యేకత కావాలి” అనుకొంది అమ్మాయి. ఇటువంటి అమ్మాయిని ఇష్టపడి, ఇద్దరూ కలసి సంపాదించుకొంటే జీవితం బాగుంటుం ది అనే ఒక్క కాన్సెప్ట్‌తో ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లో, ఇద్దరు అక్కా చెల్లెల్లు ఉ న్నా, అ బ్బాయి అన్నింటికీ సరే నని పెళ్లి చేసుకొంటే… ఆ అమాయి ఈ భారం నా వ ల్ల కాదు. నేను ఇంత కుటుంబ బాధ్యత తీసుకోలేను అనుకొంటే… పెళ్లయిన ఆరు నెలలు తిరగకుండానే భార్యాభర్తలు కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సి వస్తుంది.

గ్రూప్ వన్‌లో ఆఫీసర్ జాబ్ సంపాదించిన అమ్మాయి. అబ్బాయి అదే స్థాయి ఉద్యోగి. ఇద్దరికీ ఒకళ్ల కొకళ్లు నచ్చారు. అబ్బాయి అమ్మ ఏనాటి నుంచో అనారోగ్యంతో మంచం పట్టి ఉంది. ఆ ఏముందీ… అన్నీ పనివాళ్లే కదా అని అబ్బాయి ఈ విషయం అసలు మనసులో కూడా పెట్టుకోలేదు. పెళ్లయిన మరుక్షణం అమ్మ అనారోగ్యంగా ఉన్నా, అత్తగారిని చూసుకోనే తీరికలేదు. అలా వదిలేసే గట్టి గుండె కూడా కాదు. ఆ కాపురంలో తీరు ఏమై ఉంటుంది.

‘నాకు అమా నాన్నా బాధ్యత ఉంది నేనొక్కదాన్నే. వాళ్లని నేనే చూసుకోవాలి. నాన్నకు పెన్షన్ వస్తుంది కానీ వాళ్లిద్దరి బాధ్యత నాదే. అన్నదా అమాయి. ఆమె చక్కదనం, ఉద్యోగం, ప్రవర్తనా అన్నీ నచ్చాయి. కానీ పెళ్లైన తరువాత అమ్మాయి పూటకొకసారి వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేయటం వాళ్లకి కాస్త వళ్లు వెచ్చ బడ్డ పరుగు దీయటం, వాళ్లకోసం ప్రమోషన్ ట్రాన్స్‌ఫర్ వద్దను కోవటం ఎంత మాత్రం నచ్చలేదు అబ్బాయికి. వాళ్ల సంగతి మరచిపొమ్మన్నాడు. ఇంక తలుచుకోను అన్నదీ అమ్మాయి.

ఇద్దరూ ఉద్యోగస్తులు. అటు పుల్ల ఇటు పెట్టడు అబ్బాయి. పెళ్లికి ముందు ఇద్దరూ వంటగదిలో అడుగు పెట్టని వాళ్లే. అమ్మాయికి ఇల్లు దిద్దుకొనే చాక చక్యం లేదు. యూనివర్శిటీ నుంచి పెళ్లి పందిట్లోకి వచ్చే అబ్బాయి జీవితం లోకి వచ్చింది అమ్మాయి. నెమ్మదిగా కాఫీ పెట్టడం దగ్గర నుంచి ప్రేమగా అబ్బాయికి వండి పెట్టటం వరకు నేర్చుకొంది. పిల్లలు పుట్టేవరకూ ఎలాగో సాగింది. పిల్లలు పుట్టాక చాకిరి ఎక్కువై ఆమె తట్టుకులేక పోయింది. సుఖంగా జీవించేందుకు అలవాటుపడ్డ ఆఫీసర్ మొగుడు వంటగది కానీ, ఇంటి చాకిరి కానీ, పిల్లల బాధ్యత కానీ నాది కాదు పొమ్మన్నాడు. సరే నేనే పోతాలే. వీటన్నింటితో పాటు నీ చాకిరి నాకెందుకు అన్నది అమ్మాయి.

విడాకుల వరకు వచ్చే ఎన్నో కేసుల కథలు ఇవి. వీళ్లకు రాజీ చేయటం పరమాత్ముడి వల్ల కూడా కాదు అవి లాయరే చేతులెత్తేశారు. మరి ఈ కథలన్నీ ఏ కంచికి వెళతాయి. టైం వేస్ట్ కాకుండా న్యాచురల్ డైవర్స్‌తో తెరిపిన పడ్డారు వీళ్లంతా. ఇలాంటి కథలు సంఘటనలు ఎక్కడ నుంచి పుట్టాయి. వాస్తవ జీవితంలోంచి. చదువుకొనేటప్పుడు ఉద్యోగం వచ్చాక ఎంతో మధురంగా ఊహల్లో తోచిన కుటుంబ జీవితం ఎందుకింత మోయలేని బాధ అనిపించింది.

అవగాహనా లోపం. భార్యాభర్తలు కాదలుచుకొన్న వాళ్లు కలిసి కూర్చుని మాట్లాడుకొని సమస్య ఇది, సౌఖ్యం ఇది ఇలా మనిద్దరం మన సమయాలను కేటాయిద్దాం మన కుటుంబాల్లోని ఈ సమస్యలను ఇలా పరిష్కరించుకొందాం అని ముందే మాట్లాడుకోక పోవటం వల్ల వచ్చింది. పెళ్లికి ముందే ఇదంతా మాట్లాడుకోవాలి అంటే అంతే కదా! జీవితం చాలా విలువైంది కదా! ప్రతివాళ్ల జీవితంలోనూ ఎన్నో సమస్యలు అవసరాలు ఉంటాయి.

అవన్నీ కాబోయే దంపతులు ఆలోచించుకొని నేనీ భారం లేదా బాధ్యత మోయగలను అనుకొంటే, ముందే సిద్ధపడితే ఆ కాపురం దివ్యంగా నడుస్తుంది. ఇంటికి రాబోయే అమ్మాయి తనలాగే చదువకొని హాస్టల్స్‌లో తిని, తన కుటుంబంలోకి వచ్చిందని అబ్బాయి అతని కుటుంబ సభ్యు లు తెలుసుకోవాలి. అలాగే తను అడుగుపెట్టబోయే కుటుంబంలో ప్రేమతో చూసే భర్తతో అతని సమస్యలు కూడా ఉన్నాయని అలాగే అతని ప్రేమను, బా ధ్యతలనూ పంచుకోవాలని అమ్మాయి కూడా సిద్ధపడాలి. అప్పుడే పండంటి జీవితం ప్రారంభమౌతోంది.

ఆ చక్కని పొదరింట్లో ఇద్దరి కుటుంబాలు చక్కగా కలసి ఆనందంగా ఉండగలుగుతారు. అంతేగాని అబ్బాయి ఒక్కడుగా పుట్టుకొచ్చి అమ్మాయి చేతుల్లో ఉద్యోగం కాదు, హోదాలతో వచ్చి వాలాలని గానీ, అమ్మాయి ఉద్యోగం జీవితంతో మనింట్లోకి వచ్చి, అంట్ల గిన్నెలు తోమడం నుంచి ఫైవ్‌స్టార్ హోటల్‌హెడ్ కుక్ లాగా అన్ని వంటలు అందమైన డెకొరేషన్‌తో అమర్చి, వాళ్ల అమానాన్నాల, అక్కాచెల్లెళ్ల ఊసు ఎత్తకుండా చరణ దాసిలా పడుంటుందని అబ్బాయి అనుకొంటే ఇద్దరూ లాయర్‌ని వెతుక్కుని ఈ అదుతమైన సంసారం మాకొద్దు అని చెప్పాల్సిందే!

                                                                                                                              – సి. సుజాత
Good understanding on career to This generation girls

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అప్పుడు విడాకులే పరిష్కారం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: