‘ట్రావెల్24’

 Good response to Day Passes in Hyderabad

డే పాస్‌లకు మంచి స్పందన

మన తెలంగాణ/సిటీబ్యూరో
ఆదాయాన్ని పెంచుకునేందుకు టిఎస్ ఆర్టీసి అనేక రకాల ప్రణాళికలను రూపొందిచింది. వాటిలో భాగంగా నగరానికి రాష్ట్ర నలుమూలల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు కోసం, అదే విధంగా టూరిస్టుల సౌకర్యం కోసం 2016 అక్టోబర్‌లో ప్రారంభించిన ట్రావెల్ 24 టికెట్‌కు మంచి స్పందన వస్తోంది. గతంలో ఈ టికెట్లు ఎప్పుడు తీసుకున్నా అవి అర్థరాత్రి సమయానికి వాటి గడువు ముగిసిపోయేది. దీంతో మరుసటి రోజు పనులు ఉన్న వారు మళ్ళీ తిరిగి వాటిని కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ప్రయాణికుల సమస్యలను అర్థం చేసుకున్న అధికారులు ఈ టికెట్ తీసుకోవడంలో ఉన్న నిబంధనలు తొలగించటంతో వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. మారిన నిబంధనల ప్రకారం ఎప్పుడు టికెట్ కొంటే మరుసటి రోజ మళ్ళీ ఆ సమయం దాక పని చేస్తోంది. అంతే కాకుండా వీటి అమ్మకాలను పెంచే బాధ్యతను టికెట్లు ఇచ్చే కండక్టర్లకు ట్రావెల్ -24 టికెట్ల బాధ్యతను కూడా అప్పగించిం వారికి ప్రోత్సాహకాలను కూడా అందచేస్తోంది.ఇందుకు గాను వారికి టికెట్ .50పైసలను చొప్పున అందచేస్తుండటంతో వారు ట్రావెల్ యూజ్ యు లైక్ (ట్రావెల్ 24)అమ్మకాలపై ప్రత్యేక శ్రద్ధ్ద చూపుతున్నారు. అంతే కాకుండా నెలకు 125 టికెట్లు అమ్మిన కండకెక్టర్లకు మొదటి బహుమతి కింద రూ.300లను అదే విధంగా రెండో బహుమతి కింద రూ.250, మూడో బహుమతి కింద రూ.200 అందచేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. అంతే కాకుండా ఆర్టిసి తన వంతు కర్తవ్యంగా బస్సుల మీద, బస్టాండ్‌లలో, ప్రాంతాల్లో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తు ప్రచారం నిర్వహించింది.

నగరానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారే కాకుండా నగరంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకున్న వారు వీటిని వినియోగించుకొని తమ పనులు విజయవంతం చేసుకుంటున్నారు. తమకు కావల్సిన బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాకుండా ఒకే రోజు నాలుగైదు పనులు చేసుకోవాలనుకునే కొంత మంది ప్రయాణికులు ఆటోలను, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. వారు కూడా ఈ టికెట్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్ళడం కన్నా పర్యాటక బస్సుల్లో వసూలు చేస్తోన్న ఫీజులతో పోలిస్తే ఆర్టిసి బస్సుల్లో ప్రయాణం తక్కువ ఖర్చుతో పూర్తవుతోంది. ట్రావెల్ -24 టికెట్ ధర ఆర్డినరి బస్సుల్లో రూ.80 ఏసీ బస్సుల్లో కూడా కలిపి రూ.160 ఎలా చూసినా ఆర్డినరీ బస్సుల్లో వెళ్ళడం మేలుగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఏసీ బస్సుల్లో వెళుతూ మార్గమధ్యలో ఉన్న ప్రాంతాలను కూడా ఎక్కువగా చూటడానికి అవకాశం లభిస్తుందని నగర వాసులు చెబుతున్నారు.
గతంలో తాము ఈ టికెట్లను రోజుకు 4 నుంచి 5 మాత్రమే అమ్ముతుండే వారమని మారిన నిబంధనలతో వీటి అమ్మకాలు పెరిగాయని రోజుకు 25 నుంచి 30 టికెట్లు అమ్ముతున్నామని కండక్టర్లు చెబుతున్నారు. సిటీ శివారు ప్రాంతాలకు వచ్చే వారు అ ధికంగా వీటిని కొనుగోలు చేస్తున్నారని. వీటి అమ్మకాలు కూడా అక్కడే బాగా ఉంటున్నాయంటున్నారు. ్యబ్‌లను, ఆటోలను ఆశ్రయించే వా రు ఎక్కువగా రూ. 160తో ఏ సీ బస్సుల టికెట్లను కొనుగోలు చేస్తున్నారని, మిగతావారు ఆర్టినరి బ స్సులో లభించే రూ.80 టికెట్లు మాత్రమే కొనుగొలు చేస్తున్నారని వారు అంటున్నారు.

Comments

comments