‘గుడ్ ల‌క్ స‌ఖి’ టీజ‌ర్ విడుద‌ల

Good Luck Sakhi Teaser Released By Hero Prabhasహైదరాబాద్ : ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుడ్ ల‌క్ స‌ఖి’ సినిమా టీజర్ ను  స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా  యంగ్ రెబల్ స్టార్  ప్ర‌భాస్ శనివారం విడుద‌ల చేశారు. జాతీయ అవార్డు గ్ర‌హీత న‌గేశ్ కుకునూర్  ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో  కీర్తిసురేశ్ రైఫిల్ షూట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఓ పల్లెటూరిలో అంద‌రూ బ్యాడ్ లక్‌గా భావించే ఓ అమ్మాయి జాతీయ‌స్థాయి రైఫిల్ షూట‌ర్‌గా ఎలా ఎదిగింద‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు జగపతిబాబు రైఫిల్ షూట్ కోచ్ పాత్రలో ,కీర్తికి  జోడీగా హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ‘గుడ్ ల‌క్ స‌ఖి’ టీజ‌ర్ విడుద‌ల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.