ఆరోగ్యానికి అలోవెరా!

  వాతావరణ కాలుష్యం, కల్తీలతో విషతుల్యమవుతున్న ఆహార పదార్థాల వల్ల మధ్య వయసు కన్నా ముందే శరీరం పలు రకాల వ్యాధులకు గురవుతోంది. ఈ స్థితిలో శరీరం వ్యాధిగ్రస్తమయ్యాక బాధలు పడేకన్నా, వ్యాధులు రాకుండా నివారించే మార్గాలను అనుసరించడం ఎంతో మంచిది. అందుకు ఉపయోగపడే ఒక దివ్య ఔషధం ‘కలబంద’. జీవకణాలను పునరుజ్జీవింపచేసే శక్తి కలబందలో ఉంది. తద్వారా మనిషి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయి. కలబందలో మానవదేహానికి కావలసిన అనేక విటమిన్లు, ఎంజైములు, ప్రొటీన్లు, క్యాల్షియం సమృద్ధిగా […]

 

వాతావరణ కాలుష్యం, కల్తీలతో విషతుల్యమవుతున్న ఆహార పదార్థాల వల్ల మధ్య వయసు కన్నా ముందే శరీరం పలు రకాల వ్యాధులకు గురవుతోంది. ఈ స్థితిలో శరీరం వ్యాధిగ్రస్తమయ్యాక బాధలు పడేకన్నా, వ్యాధులు రాకుండా నివారించే మార్గాలను అనుసరించడం ఎంతో మంచిది. అందుకు ఉపయోగపడే ఒక దివ్య ఔషధం ‘కలబంద’. జీవకణాలను పునరుజ్జీవింపచేసే శక్తి కలబందలో ఉంది. తద్వారా మనిషి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయి. కలబందలో మానవదేహానికి కావలసిన అనేక విటమిన్లు, ఎంజైములు, ప్రొటీన్లు, క్యాల్షియం సమృద్ధిగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

1. కలబందన సేవనం వల్ల గుండె రక్తనాళాలు శుభ్రపడి, గుండె జబ్బులు దూరమవుతాయి. కిడ్నీలోని రాళ్లూ మూత్రం ద్వారా బయటకు వెళ్లడంతోపాటు, రాళ్లు మళ్లీ తయారు కాకుండా ఉంటాయి. శరీరంలోని విషపదార్థాలను కలబంద వెలుపలికి నెట్టివేస్తుంది. రక్తాన్ని శుభ్రం చేయడంలో దీన్ని మించింది లేదు. దోష రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు, మూత్ర సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది. జీర్ణాశయ లోపాలను తొలగించి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. పలు రోగాలకు మూలమైన మలబద్ధకం సమస్యను సమూలంగా తొలగిస్తుంది. సహజంగా 40 ఏళ్లు దాటిన వారిలో జీవకణాలు నశించిపోయే వేగం పెరుగుతుంది. దీనివల్ల ఆ వయస్కుల్లో మతిమరుపు, నీరసం, శరీరం తరుచూ ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా కలబంద నివారించడంతో పాటు జీవకణాలను చైతన్యపరుస్తుంది.

2. రజస్వల అయిన అమ్మాయిలు ప్రతి రోజూ కలబందను సేవిస్తే రుతుపరమైన సమస్యలేవీ దరిచేరవు. అంతే కాదు. సుఖప్రసవానికి కూడా ఇది తోడ్పడుతుంది. కలబందకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే గుణం ఉంది. ప్రతి రోజూ 20 మి.లీ అలోవెరా గుజ్జుకు చిటికెడు పసుపు కలిపి, పావు లీటరు నీటితో సేవిస్తే, శరీరంలోని మలినాలన్నీ తొలగిపోవడంతో పాటు కొవ్వు కరిగి సన్నబడతారు. నిద్రలేమి సమస్యను తొలగించగల చక్కని ఔషధం కలబంద. రక్తహీనత ఉన్న వారిలో తెల్లరక్తకణాలు పెరిగి, ఎర్ర రక్తకణాలు తగ్గిపోతాయి. ఫలితంగా శ్వా స తీసుకోవడం కష్టమవుతుంది. ఈ స్థితిలో శరీరం లోకి నీరు చేరడంతో పాటు, శక్తిహీనమై తీవ్ర మైన నిస్సత్తువ ఆవరిస్తుంది. ప్రతి రోజూ కలబం దను సేవిస్తే, ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. అనేక రకా ల ఉదర సంబంధ వ్యాధులు కలబంద సేవనంతో హరిస్తాయి. దీని వల్ల హైపర్ ఎసిడిటీ దూరం కా వడంతో పాటు, అల్సర్, అజీర్ణవ్యాధులు నయమవుతాయి.

Good Health With Aloe Vera

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: