గోల్డ్‌మన్ సాచ్స్ ఉపాధ్యక్షుడురూ.38 కోట్ల మోసం

బెంగళూరు: ఆన్‌లైన్ గేమ్‌లో నష్టాలను చవిచూసి వాటి నుంచి బయటపడేందుకు గాను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశ్వనీ జున్‌జున్‌వాలా కంపెనీలో మోసానికి పాల్పడి కటకటాల పాలయ్యారు. దాదాపు రూ.38 వేల కోట్లు కంపెనీ నుంచి అపహరించారనే ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. గోల్డ్‌మన్ సాచ్స్ వైస్ ప్రెసిడెంట్ అయిన జున్‌జున్‌వాలాను పోలీసులు కోర్టులో హాజరుపర్చినట్టు పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఎంఎన్ అనుచెత్ తెలిపారు. కంపెనీ లీగల్ హెడ్ అభిషేక్ పర్శీర ఫిర్యాదు ఆధారంగా అశ్వనీ జున్‌జున్‌వాలా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, జున్‌జున్‌వాలా తన ప్లాన్ కోసం ముగ్గురు సబార్టినేట్లు గౌరవ్ మిశ్రా, అభిషేక్ యాదవ్, సుజిత్ అప్పయ్యలను ఉపయోగించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. జున్‌జున్‌వాలా శిక్షణ సాకుతో వారిని వినియోగించుకున్నారు. నీటి కోసం వారిని బయటికి పంపిన జున్‌జున్‌వాలా.. వారి సిస్టమ్‌లోకి లాగ్ అయ్యారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాకు అక్రమంగా రెండు వాయిదాల్లో రూ.38 కోట్లను బదిలీ చేశాడని పోలీసులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో పోకర్ గేమ్‌తో నష్టాలు
ఆన్‌లైన్ పోకర్‌లో డబ్బు పోగొట్టుకున్న తర్వాత అశ్వని జున్‌జున్‌వాలా ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జున్‌జున్‌వాలా గత నాలుగు సంవత్సరాలుగా గోల్డ్‌మన్ సాచ్స్‌లో పనిచేస్తున్నారు. ఒక ఉద్యోగి రెండు అనుమానాస్పద లావాదేవీలను ప్రశ్నించినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 6న సంస్థ అంతర్గత సమీక్షతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత జున్‌జున్‌వాలా అనుచరులు గౌరవ్ మిశ్రా, సుజిత్ అపయ్య, అభిషేక్ యాదవ్లను కూడా ప్రశ్నించారు.

Goldman Sachs Vice President arrested for Rs 38 cr fraud

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోల్డ్‌మన్ సాచ్స్ ఉపాధ్యక్షుడురూ.38 కోట్ల మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.