శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

Gold Seized At Shamshabad Airportరంగారెడ్డి : రియాద్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో శుక్రవారం రాత్రి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారి నుంచి 837 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.46 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.