శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో ఉన్న జేబుల్లో వీరు బంగారాన్ని తెస్తున్నారని, ఈ క్రమంలో వారిని తనిఖీ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని వారు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగించామని […] The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో ఉన్న జేబుల్లో వీరు బంగారాన్ని తెస్తున్నారని, ఈ క్రమంలో వారిని తనిఖీ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని వారు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగించామని చెప్పారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Gold Seized at Shamshabad AirPort

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: