మెరిసిన బంగారం

 అక్షయ తృతీయ నాడు అమ్మకాల జోరు గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగిన సేల్స్ ముంబై: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు జోరుగా బంగారం కొనుగోళ్లు జరిపా రు. వినియోగదారులను ఆకర్షించేందుకు జువెలరీ షాప్ లు ధరలను తగ్గించడం, డిస్కౌంట్లు వంటివి ఆఫర్లను ప్రకటించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పసిడి కొనుగోళ్లు 25 శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. బంగారం రిటైల్ ధర తగ్గడం, పెళ్లి సీజన్ వంటి అంశాలు కొనుగోళ్లకు ఊతమిచ్చాయని పరిశ్రమ […] The post మెరిసిన బంగారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 అక్షయ తృతీయ నాడు అమ్మకాల జోరు
గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగిన సేల్స్

ముంబై: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు జోరుగా బంగారం కొనుగోళ్లు జరిపా రు. వినియోగదారులను ఆకర్షించేందుకు జువెలరీ షాప్ లు ధరలను తగ్గించడం, డిస్కౌంట్లు వంటివి ఆఫర్లను ప్రకటించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పసిడి కొనుగోళ్లు 25 శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. బంగారం రిటైల్ ధర తగ్గడం, పెళ్లి సీజన్ వంటి అంశాలు కొనుగోళ్లకు ఊతమిచ్చాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రిటైల్ బంగారం ధరల ట్రేడింగ్ గతేడాదితో పోలిస్తే 7 శాతం తక్కువగా ఉంది. గతేడాది 10 గ్రాముల పసిడి ధర రూ.32 వేల వద్ద ఉంది. గత కొన్నేళ్లుగా డీమానిటైజేషన్(నోట్ల రద్దు), జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వంటి నిర్ణయాలతో పసిడికి ఆశించినంతగా డిమాండ్ లభించలేదు. 2016 నుంచి తొలిసారిగా ఈ అక్షయ తృతీయ రోజు భారీగా కొనుగోళ్లు జరగడం గమనార్హం.

ఆఫీస్ అవర్స్ తర్వాత కొనుగోళ్లు

‘మంచి అడుగులు సానుకూల సెంటిమెంట్‌కు సంకేతం. ప్రజలు బంగారం కొనుగోళ్ల కోసం ఆసక్తి చూపారు. ఆఫీస్ అవర్స్ తర్వాత కొనుగోళ్లు జరిగాయి. ఇంకా రాత్రి సమయంలో మరింతగా కొనుగోళ్లు జరిగే అవకాశముంది’ అని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సౌరభ్ గాడ్గిల్ అన్నారు. అక్షయ తృతీయ రోజు తక్కువ బరువు కల్గిన నగలు తీసుకుంటారని, బంగారంవెండి నాణేలు, పెళ్లి నగలు సేల్ అయ్యాయని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 25 శాతం వాల్యూమ్ వృద్ధిని సాధిస్తామని అంచనా వేస్తున్నట్టు గాడ్గిల్ అన్నారు.

నివేదికలు సానుకూలం

దేశవ్యాప్తంగా పరిశ్రమకు సానుకూల నివేదికలు వచ్చాయని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు. సా యంత్రం సమయంలో కొనుగోళ్లు ఊపందుకున్నాయని, రోజంతా నగల దుకాణాలు కళకళలాడాయని తెలిపారు.

పెళ్లి సీజన్ డిమాండ్ : కళ్యాణ్ జువెలర్స్

‘దక్షిణాది ప్రాంతాల్లో అలాగే ఉత్తారాదిన మంచి స్పందన కనిపించింది. పెళ్లి సీజన్ కావున ఈసారి బంగారానికి డిమాండ్ బాగుంది. తక్కువ ధర నుంచి వినియోగదారులు కూడా ప్రయోజనం పొందుతున్నారు’ అని కళ్యాణ్ జువెలర్స్ చైర్మన్ టిఎస్ కళ్యానరామన్ అన్నారు. గతేడాదితో పోలిస్తే 2019లో పెళ్లి రోజులు చాలా ఉన్నాయని, అందువల్ల ఈ అక్షయ తృతీయ సందర్భంగా కుటుంబాలు ఎక్కువగా పెళ్లి కొనుగోళ్లు చేపట్టనున్నారని అన్నారు. మెట్రో నగరాల్లో యువ కొత్త కొనుగోలుదారులు ఆసక్తి చూపారని, మెట్రో యేతర నగరాల్లో సెంటిమెంట్ సానుకూలంగా ఉందని తెలిపారు.

రెండంకెల వాల్యూమ్ వృద్ధి : తనిష్క్

గతేడాదితో పోలిస్తే ఈసారి ఆరోగ్యకరమైన రెండంకెల వాల్యూమ్ వృద్ధిని సాధిస్తామని తనిష్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కుల్హల్లి అన్నారు.

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

ముంబై: అక్షయ తృతియ రోజు తగిన డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర తగ్గింది. మంగళవారం నాడు బులియన్ మార్కెట్లో 10 గ్రాములు పసిడి ధర రూ.50 తగ్గి రూ.32,67కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా రూ.10 (కిలో) తగ్గింది. ఆఖరికి రూ.38,120 వద్ద స్థిరపడింది. అక్షయ తృతియ రోజు అయినప్పటికీ దేశీయంగా స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి డిమాండ్ ఆశించిన మేరకు కనిపించలేదని ట్రేడర్ల తెలిపారు.

అక్షయ తృతియను బంగారం కొనుగోలు చేసేందుకు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కల్గిన బంగారం ధర రూ.50 తగ్గి వరుసగా రూ.32,670, రూ.32,500 (10 గ్రాములు)కు చేరింది. వెండి ధర కిలో రూ.10 తగ్గి రూ.38,120గా ఉంది. అయితే అంతర్జాతీయంగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. న్యూయార్క్‌లో ఔన్స్ పసిడి ధర 1,282.20 డాలర్లు, అలాగే ఔన్స్ వెండి ధర 14.92 డాలర్లుగా ఉంది.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెరిసిన బంగారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: