దిగొచ్చిన బంగారం ధర…

  ముంబై : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రూ.35 వేల మార్క్‌ను దాటి ఆకాశాన్నంటిన బంగారం ధరలు మళ్లీ దిగివస్తున్నాయి. మంగళవారం పసిడి ధర పది గ్రాములు రూ.35 వేల దిగువకు చేరింది. బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకం పెంచడంతో రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పసిడి రేట్లు తాజాగా అంతర్జాతీయ, దేశీయ కారణాలతో బలహీనపడింది. అలాగే దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం […] The post దిగొచ్చిన బంగారం ధర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రూ.35 వేల మార్క్‌ను దాటి ఆకాశాన్నంటిన బంగారం ధరలు మళ్లీ దిగివస్తున్నాయి. మంగళవారం పసిడి ధర పది గ్రాములు రూ.35 వేల దిగువకు చేరింది. బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకం పెంచడంతో రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పసిడి రేట్లు తాజాగా అంతర్జాతీయ, దేశీయ కారణాలతో బలహీనపడింది. అలాగే దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది.

మంగళవారం నాటి మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 34,870కి పడిపోయింది. మరోవైపు వెండి కూడా స్వల్పంగా దిగొచ్చింది. కిలో వెండి ధర రూ. 48 తగ్గి రూ. 38,900 పలికింది. గత శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 10శాతం నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బంగారం ధర అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. గత వారాంతంలో రూ. 35వేల మార్క్ దాటి రూ. 35,470కి చేరింది. అయితే సుంకాల పెంపు ధరలపై ప్రభావం చూపుతోందని, దీని వల్ల దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Gold Prices are Falling

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దిగొచ్చిన బంగారం ధర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: