కాళేశ్వరం ప్రభావంతో ఉబుకుతున్న భూగంగ

Godavari water to irrigate KCR farmlands

 

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రవహించే ప్రతిచోట భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని సాగునీటిపారుదల శాఖ అంచనావేసింది.

150 రోజులపాటు కాకతీయకాల్వలో గోదావరి జలాల ప్రవాహం, ఎస్‌ఆర్‌ఎస్ పూర్తి స్థాయి ఆయకట్టుకు చరిత్రలో మొదటిసారి నీరు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నల్గొండ, నిజమాబాద్, జిగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, యాదాద్రి, సుర్యాపేట జిల్లాల్లో కాళేశ్వరం కట్టకముందు ఇప్పటికి భూగర్భజలాల్లో వ్యత్యాసం స్పష్టంగా అగుపిస్తోందని ఇంజనీర్లు గుర్తించారు. అలాగే కాళేశ్వరం జలప్రవాహ ప్రాంతాల్లో వర్షపాతం కూడా పెరగడంతో పాటు పర్యావర ణం కూడా పచ్చబడినట్లు అధికారులు రికార్డులు రూపొందిస్తున్నారు. 2018కి ముందు భూగర్భజలాలు 20 మీటర్లకు పైగా లోతులో ఉన్న భూగర్భజలాలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం ప్రస్తుత వేసవికాలంలో 5 మీటర్లవరకు అం దుబాటులోకి వచ్చాయి.

భూగర్భజలవనరుల శాఖ నిర్వహించిన క్షేత్రస్థాయి సాంకేతిక సర్వే ఆధారంగా ఒకమ్యాప్‌ను రూపొందించారు. చిక్కటి నీలి రంగు ఉన్న ప్రాంతాల్లో జలవనరులు 5 మీటర్లలోతులో ఉన్నట్లు కనుగొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 233 కిలోమీటర్ల పరిధిలో చిక్కటి నీలి రంగు ఉన్న ప్రాంతాలుగా నిర్మల్, జగిత్యాల,నిజామాబాద్, సిరిసిల్ల, కామరెడ్డి, భూపాలపల్లి, అనంతగిరి, సిద్ధిపేట, సూర్యాపేటలోని కొన్నిప్రాంతాలున్నాయి. అలాగే నీలి రంగు పల్చగా ఉన్న 3 వేల 715 కిలోమీటర్ల పరిధిలో ఐదు నుంచి 10 మీటర్ల పరిధిలో భూగర్భజలాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో రాజన్నసిరిసిల్లలోని కొన్ని ప్రాంతాలు,యాదాద్రి భువనగిరి జిల్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు అంచనావేశారు. అలాగే మిగతాప్రాంతాల్లో 10 నుంచి 15 మీటర్లు కొన్ని ప్రాంతాల్లో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 20 నుంచి ఆపైన మీటర్లలోతులో భూగర్భ నీళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాళేశ్వరం జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో భూగర్భ జల భాండాగారం 5మీటర్ల లోతులోనే అందుబాటులో ఉండగా మిగతాప్రాంతాల్లో వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు అంచనావేశారు. ప్రస్తుతం భూగర్భజలాలపై నిపుణులు నివేదికలను రూపొందిస్తున్నారు. గతానికంటే మెరుగ్గా భూగర్భజలాలు పెరుగుతున్నాయని నిపుణులు ధృవీకరిస్తున్నారు. అయితే మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో భుగర్భజల భాండాగారాలు ఏర్పడటంతో బావులు,బోర్ల కష్టాలు తీరిపోతున్నాయి. ఐదుమీటర్లలోతులోనే నీటిని తోడుకునే అవకాశాలు మెరుగు అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భూగర్భజలాల పెరుదలలో వ్యత్యాసాలున్నాయి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వందలాధి అడుగుల లోతులో ఉన్న నీరు ప్రస్తుతం పైకి వస్తోందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎండి, చీఫ్ ఇంజనీర్ హరిరాం చెప్పారు. ఇంకా అత్యధికంగా పెరేగే అవకాశాలున్నాయన్నారు. కాళేశ్వరం నుంచి రిజర్వార్లు నిండుతుండటంతో ఆప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే భూతాపం తీరిన అనంతరం క్రమేణ భూముల అంతర్భాగంలో నీటినిల్వలు పెరుగుతాయని ఆయన చెప్పారు. పంటపొలాలు ఉన్నప్రాంతాల్లో మరింత వేగంగా భూగర్భజలాలు పెరుగుతాయన్నారు.

Godavari water to irrigate KCR farmlands

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాళేశ్వరం ప్రభావంతో ఉబుకుతున్న భూగంగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.