కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

  8.72 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న వరద మేడిగడ్డ బ్యారేజ్‌లో 65 గేట్లను ఎత్తిన అధికారులు 4.78 లక్షల క్యూసెక్కుల గోదావరి ఇన్‌ఫ్లో, 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్న అధికారులు వరంగల్  : గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి, ఇంద్రావతి నదులకు పైన కురుస్తున్న వర్షాలతో ఈ రెండు నదులు శుక్రవారం ఉగ్రరూపం దాల్చాయి. దీని ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్‌గా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్‌కి […] The post కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

8.72 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న వరద
మేడిగడ్డ బ్యారేజ్‌లో 65 గేట్లను ఎత్తిన అధికారులు
4.78 లక్షల క్యూసెక్కుల గోదావరి ఇన్‌ఫ్లో, 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్న అధికారులు

వరంగల్  : గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి, ఇంద్రావతి నదులకు పైన కురుస్తున్న వర్షాలతో ఈ రెండు నదులు శుక్రవారం ఉగ్రరూపం దాల్చాయి. దీని ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్‌గా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్‌కి ప్రాణహిత, గోదావరిల నీటి ప్రవాహం 4.78 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో బ్యారేజ్‌లోని 65 గేట్లను తెరిచారు. వస్తున్న నీటి ఫ్లోలో 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదిలారు.

మహారాష్ట్ర నుంచి ఉధృతంగా ప్రవహిస్తు వస్తున్న గోదావరి నది మేడిగడ్డ బ్యారేజ్‌ను దాటుకుని దేవాదులకు పయనిస్తుండగా ములుగు జిల్లా పరిధిలోని వాజేడు మండలం పేరూరు వద్ద ఛత్తీస్‌గడ్ నుంచి వస్తున్న ఇంద్రావతి నది పేరూరు వద్ద గోదావరిలో కలిసింది. రెండు నదుల సంగమంతో ఆరు లక్షల క్యూసెక్కుల నీరు దేవాదుల బ్యారేజ్‌కు పోటెత్తింది. ఆ నీరంతా కూడా ఏటూరునాగారం నుంచి భద్రాచలం వైపు గోదావరి భారీగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 11 మోటార్లు వెట్న్ చేయకుండా నిలిపివేశారు. మూడు రోజుల క్రితం వరకు కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బ్యారేజ్‌కి చేరి న నీటితోపాటు రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు నీటితో కలిసి ప్రస్తుతం బ్యారేజ్‌లో 9.72 టీఎంసీల నీరు చేరుకుంది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి బ్యారేజీల్లోకి భారీ ఎత్తున నీరు చేరుతుండటం వల్ల ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు వస్తున్న నీటి ఇన్‌ఫ్లోను బట్టి ఔట్‌ఫ్లోకు గేట్లను తెరుస్తున్నారు.

శుక్రవారం సాయత్రం అన్నారం బ్యారేజ్‌లోని రెండు గేట్లను తెరిచి దిగువనున్న సుందిళ్లకు నీటిని వదులుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఏకధాటి గా కుండపోత వర్షం పడుతోంది. ప్రధానంగా గోదావరి నది తీరం నిండుగా ప్రవహిస్తుండగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ప్రదేశంలో ఉన్న జంపన్న వాగు ఉప్పొంగి అక్కడ ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా ప్రవహిస్తోంది.

వాజేడు మండలంలో ఉన్న బోగ త జలపాతం భారీ ఎత్తున ఉప్పొంగడంతో శబ్దాలు చేస్తు కొండల నుంచి జాలు వారి న నీరు జలపాతం వద్ద దుముకుతోంది. కాళేశ్వరం దేవస్థానం వద్ద ఉన్న పుష్కర ఘాట్ల వద్ద 8.72 మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తోంది. ఏటూరునాగారంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్లను దాటి గోదావరి ప్రవహిస్తోంది. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల పరిధిలోని బ్యారేజ్‌ల కు వచ్చే పర్యాటకుల్ని నిషేధించారు. అంతర్ రాష్ట్ర వంతెనల వద్ద గోదావరి ఉప్పొంగుతుండటంతో పర్యాటకుల్ని అనుమతించడం లేదు.

Godavari River at Kaleshwaram is high flow

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: