చమురుకు గ్లోబల్ సెగ

Crude oil

 

తగ్గుతున్న డిమాండ్.. ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు
సవాల్‌గా మారిన అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి: ఐఇఎ

లండన్: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనల నెలకొన్నాయని, అమెరికా చైనా వాణిజ్య వివాదాలు వీటికి ఆజ్యం పోస్తున్నాయని, ఇది చమురు డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఇఎ) పేర్కొంది. ఈ కారణంగా 2019, 2020 సంవత్సరాల్లో చమురు డిమాండ్ వృద్ధి తగ్గనుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది(2019) తొలి అర్ధభాగంలో చమురుకు డిమాండ్ తగ్గినట్లు తాజాగా పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో గత వారం ముడిచమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. పలు అంశాలు చమురు ధరలపై ప్రభావం చూపాయి. వీటిలో ముందుగా చెప్పాల్సింది.. చైనా దిగుమతులపై అదనపు టారిఫ్‌లు విధించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన చేయడం..ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో మరోసారి వాణిజ్య వివాదాలు ఉధృతమయ్యాయి. దీంతో చమురు ధరలు పతనమయ్యాయి.

2008 తర్వాత ఇప్పుడే
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో చమురు డిమాండ్ రోజుకి 5.2 లక్షల బ్యారళ్లమేర మాత్రమే పెరిగిందని ఐఇఎ వెల్లడించింది. 2008లో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం తర్వాత ఇదే అత్యంత కనిష్టస్థాయి. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడం కారణమైనట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు ప్రభావాన్ని చూపినట్లు పేర్కొంటున్నాయి. అయితే చైనా నుంచి అత్యధిక స్థాయిలో రోజుకి 5 లక్షల బ్యారళ్లకు డిమాండ్ కనిపించింది.

అమెరికా నుంచి రోజుకి లక్ష బ్యారళ్లు మాత్రమే డిమాండ్ నమోదైనట్లు ఐఇఎ పేర్కొంది. ఈ ఏడాది చమురు డిమాండ్ రోజుకి 1.1 మిలియన్ బ్యారళ్లు మాత్రమే పెరగనున్నట్లు ఐఇఎ తాజాగా అంచనా వేసింది. ఈ బాటలో 2020లో రోజుకి 1.3 మిళ్ల అదనపు చమురుకు మాత్రమే డిమాండ్ పుట్టవచ్చని అభిప్రాయపడింది. గతేడాది(2018)తో పోలిస్తే మే నెలలో రోజుకి 1.6 లక్షల బ్యారళ్లమేర డిమాండ్ క్షీణించినట్లు తెలియజేసింది. కాగా.. ఒపెక్ దేశాలు, రష్యా తదితన నాన్‌ఒపెక్ దేశాల ఉత్పత్తి నియంత్రణలు, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు తదితర అంశాలు చమురు ధరలకు మద్దతును అందించగలవని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

56 డాలర్లకు చేరిన చమురు
అమెరికా, చైనా మధ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న ఆందోళనలతో పాటు యుఎస్‌లో ఇంధన నిల్వలు పెరగడంతో తిరోగమించాయి. దీంతో లండన్‌లో బ్రెంట్ చమురు బ్యారల్ 56 డాలర్లకు చేరింది. న్యూయార్క్‌లో నైమెక్స్ చమురు 51 డాలర్లకు బలహీనపడింది. అయితే ఉత్పత్తి తగ్గింపుపై ఒపెక్ దేశాల సంసిద్ధత, యూరోపియన్ నిల్వలు తగ్గడం, చమురు ఫ్యూచర్స్‌లో షార్ట్ కవరింగ్ వంటి అంశాలతో చివరి రెండు రోజులూ ధరలు రికవర్ అయ్యాయి. శుక్రవారం 2- నుంచి 4 శాతం మధ్య ధరలు పుంజుకున్నాయి. దీంతో గత వారం బ్రెంట్ బ్యారల్ నికరంగా 5 శాతంపైగా క్షీణించింది. 58.53 డాలర్ల వద్ద ముగిసింది.

Global economic uncertainty threatens oil demand

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చమురుకు గ్లోబల్ సెగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.