మమ్ముల్ని చంపేస్తారేమో…. రక్షణ కలిపించండి …

లక్నో : దేశంలో చాలా చోట్ల పరువు హత్యలు జరుగుతున్నాయి. తమకు ఇష్టం లేని వారిని ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారన్న కోపంతో చాలా మంది తల్లిదండ్రులు పరువు హత్యల పేరుతో తమ పిల్లల బతుకులను చిదిమేస్తున్నారు. ఈ క్రమంలోనే యుపిలో ఓ బిజెపి ఎంఎల్ఎ కూతురు తన తండ్రిపై ఆరోపణలు చేశారు. తాను ఓ దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఈ పెళ్లి ఇష్టం లేని తన తండ్రి తనతో పాటు తన భర్తను చంపేందుకు […] The post మమ్ముల్ని చంపేస్తారేమో…. రక్షణ కలిపించండి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో : దేశంలో చాలా చోట్ల పరువు హత్యలు జరుగుతున్నాయి. తమకు ఇష్టం లేని వారిని ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారన్న కోపంతో చాలా మంది తల్లిదండ్రులు పరువు హత్యల పేరుతో తమ పిల్లల బతుకులను చిదిమేస్తున్నారు. ఈ క్రమంలోనే యుపిలో ఓ బిజెపి ఎంఎల్ఎ కూతురు తన తండ్రిపై ఆరోపణలు చేశారు. తాను ఓ దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఈ పెళ్లి ఇష్టం లేని తన తండ్రి తనతో పాటు తన భర్తను చంపేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించింది. తన తండ్రి నుంచి తమకు రక్షణ కలిపించాలని ఆమె పోలీసులను కోరుతుంది. యుపిలోని బిథారి చేన్ పూర్ ఎంఎల్ఎ రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా (23), అజితేశ్ కుమార్ (29) అనే దళిత యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో వారు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో తమపై కక్ష కట్టిన తన తండ్రి రాజేశ్ మిశ్రా గుండాలతో తమను చంపించేందుకు కుట్ర చేస్తున్నారని సాక్షి ఆరోపించింది. తమకు రక్షణ కలిపించాలని ఆమె పోలీసులను కోరుతోంది. దీనిపై పోలీసులు స్పందించారు. సాక్షి, అజితేశ్ లకు తప్పక రక్షణ కలిపిస్తామని పోలీసులు తెలిపారు. అయితే వారు ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Give Us Protection … Couple Appealed To Police

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మమ్ముల్ని చంపేస్తారేమో…. రక్షణ కలిపించండి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.